టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితుల్ని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషను విచారించిన హైకోర్టు ఏపీ ప్రభుత్వంతో పాటు టీటీడీ, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది.
గత ప్రభుత్వంలో తొలగించిన రమణదీక్షితులను ఇప్పుడు తిరిగి ఆ పదవిలో ఎలా నియమిస్తారని ఆయన కోర్టులో ప్రశ్నించారు. వేణుగోపాల దీక్షితుల పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
గతంలో పరిణామాలు గమనిస్తే… గతంలో రమణదీక్షితులను కొన్ని అక్రమాల వల్ల ఆ పదవి నుంచి తొలగించారు. అప్పట్నుంచి ఆయన జగన్ భక్తుడిగా మారి జగన్ పార్టీ కోసం పనిచేశారు. నిజాలు అన్నీ దాచిపెట్టి ఆలయంలో లేని (టీటీడీ ధృవీకరించింది) పింక్ డైమండ్ గురించి చంద్రబాబుపై నోటికొచ్చిన ఆరోపణలు చేశారు.
తదనంతరం వైసీపీకి అధికారంలోకి రావడంతో జగన్ తన కోసం పనిచేసిన రమణదీక్షితులకు తిరిగి ప్రధాన అర్చకుడిగా నియమించాడు. స్వామి వారి అర్చకుడు అయిన రమణ దీక్షితులు జగన్ ని విష్ణుస్వరూపంగా కీర్తించి భక్తులను అవమానించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేని పింక్ డైమండ్ మాయమైంది అంటూ కేసు వేసి తిరుమల ప్రతిష్ట మంటగలిపినందుకు విజయసాయిరెడ్డితో పాటు రమణ దీక్షితులు పై కూడా దేవస్థానం పాలక మండలి వంద కోట్లకు పరువునష్టం దావా వేసింది.(1/2) pic.twitter.com/3iY8cI4PsE
— Telugu Desam Party (@JaiTDP) April 3, 2021
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు. #YSJaganCares #TTD #Tirumala pic.twitter.com/CQP2V9sLMH
— YSR Congress Party (@YSRCParty) April 6, 2021