చేసేది హితబోధ అయినప్పుడు చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పేస్తే సరి. కానీ.. సంబంధం లేని అంశాల్ని తీసుకొచ్చి.. దానికి ఏడుపు అనే ఎమోషన్ ను తగిలించి.. జనాల మీదకు వీడియోలు వదిలి సాధించాలనుకుంటున్నది ఏమిటి? అన్నప్పుడు వచ్చే సమాధానం.. ‘లైవ్’లో ఉండటం అన్న మాట చప్పున రాక మానదు. బిగ్ బాస్ రివ్యూలతో ఫేమస్అయి.. బుల్లితెర మీద వెలుగుతున్న తాజా స్టార్ గీతూ. హుషారుగా ఉంటూ గలగల మాట్లాడేసే ఈ అమ్మాయి తాజాగా ఒక వీడియోను జనాల మీదకు వదిలేసింది. అందులో బాడీ షేమింగ్ అంటూ తన లైఫ్ లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఏకరువు పెట్టింది.
మరిన్ని మాటలు చెప్పిన ఈ అమ్మాయి .. బిగ్ బాస్ రివ్యూల వేళలో.. షణ్ముఖ్ అలియాస్ షన్నూను పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిందెందుకు? అన్న ప్రశ్నకు మాత్రం అమ్మడి నోటి నుంచి సమాధానం రాదు. తాను డ్రెస్సలు చాలా జాగ్రత్తగా.. కవర్ చేసేలా వేసుకుంటానని.. రీల్స్ చేసేటప్పుడు కూడా క్లోజ్ ప్ మీదనే ఎక్కువగా చేస్తానని కారణం తనవి పెద్దవని.. చిన్నతనం నుంచి అవి అలా పెరిగి ఉండటంతో తాను చాలా ఇబ్బందికి గురయ్యేదానిని అంటూ చెప్పుకొచ్చింది.
మనలో మన మాట.. ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అందంగానూ.. ఆకర్షణీయంగానూ ఉండే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఇలియానా అన్నంతనే ఒకలా.. రాశి అన్నంతనే మరోలా.. సల్మాన్ అన్నప్పుడు కండల వీరుడని.. బన్నీ అన్నంతనే స్టైలీష్ అని.. ఇట్టే గుర్తుకు తెచ్చేసుకుంటారు.
ఇదంతా ఎందుకు? అంటే.. గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక్కోక్కరిలో ఒక్కోక్కటి బాగా ఎగ్జిబిట్ అవుతుంటుంది. మిగిలినవారి కంటే కాస్త భిన్నంగా ఉన్నవి ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. అలాంటి వాటిని ఎక్కువగా పట్టించుకుంటే తలనొప్పి తప్పించి మరొకటి ఉండదు.
ఒకరు నల్లగా ఉన్నానని ఏడ్చేసే నలుపు పోతుందా? నేను బాగా తెల్లగా ఉన్నానని.. కాస్తంత పింక్ లుక్ లో ఉంటే బాగుండనుకుంటే తెలుపుదనం పోతుందా? ఇలాంటి మన ఆలోచనల్ని.. బాడీ షేమింగ్ చేస్తున్నారంటూ ఒక చర్చను తీసుకురావటంలో ఏమైనా అర్థముందా? అన్నది ప్రశ్న. తాజాగా విడుదల చేసిన వీడియోలో బోలెడన్నిసార్లు కట్లు చూస్తే.. ఈ వీడియోను తన ఇమేజ్ ను పెంచుకోవటానికి వీలుగా ఉందే తప్పించి మరొకటి కాదని చెప్పక తప్పదు.
ఇప్పటివరకు గీతూను చూసినోళ్లలో ఆమె టాలెంట్ ను చూసి మురిసిన వారు.. ఆమె మాటలకు ఫిదా అయినోళ్లు.. ఆమె చురుకుదనానికి పడిపోయినోళ్లు కాస్తా.. ఇప్పుడు ఆమెకు ఆమెగా ‘‘నావి పెద్దవి’’ అన్న మాట పుణ్యమా అని ఇప్పుడు నిజంగానే ఆమెను ఆ కోణంలో చేసే వీలుంది. ఇదంతా చూసినప్పుడు ఎవరో ఏదో అన్నారని.. ఎవరో ఎలానో చూశారని ప్రపంచం మొత్తానికి చెప్పటం దేనికి నిదర్శనం? దాన్ని బాడీ షేమింగ్ అంటూ వాపోవటంలో అర్థం ఉందా గీతూ?