TANA బిజినెస్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కమిటీ చైర్ పర్సన్ గా డాక్టర్ సుబ్బా యంత్ర ను నియమించామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. తానా కమ్యూనిటీకి సేవలందించేందుకు మీతో కలిసి పనిచేయడానికి TANA ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డాక్టర్ సుబ్బా యంత్ర ఎంబీఎలో పీహెచ్ డీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో జాస్పర్ టెక్నాలజీస్ ను స్థాపించి ప్రస్తుతం ఆ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న మోహన్ స్పిన్ టెక్స్ కు ప్రమోటర్ డైరెక్టర్, గ్లోబల్ సేల్స్ హెడ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. వ్యాపార రంగంలో 25 సంవత్సరాల విశేష అనుభవం ఆయనకుంది. పాతికేళ్లుగా ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా కొససాగుతున్నారు. రిటైల్, టెక్స్ టైల్, ఐటీ రంగాలలో పలు కంపెనీలు సాధించి వాటిని విజయవంతంగా నడుపుతున్నారు. వ్యాపార రంగంలో విశేషమైన పరిచయాలుండడం, వ్యాపారులతో,ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం సుబ్బా యంత్ర విశిష్టత.
ఇండియాతో పాటు అమెరికాలోని బే ఏరియాలో పలువురు ఎంబీఏ విద్యార్థులకు ఆయన అడ్జసెంట్ ఫ్యాకల్టీగా వ్యవహరించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంబీఏ(మార్కెటింగ్) లో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ లో పీహెచ్ డీ సాధించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో భార్య, ఇద్దరు కుమారులతో ఆయన నివసిస్తున్నారు. తనను TANA బిజినెస్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించిన సందర్భంగా జయరాం కోమటి, వెంకట్ అడుసుమల్లి లకు, బే ఏరియాలోని తానా నాయకులకు సుబ్బా యంత్ర కృతజ్ఞతలు తెలిపారు.