యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం `డబుల్ ఇస్మార్ట్`. 2019లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ ఇది. కావ్య థాపర్ హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. మణిశర్మ సంగీతం అందించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా చేశారు. భారీ అంచనాల నడుమ నేడు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ కు ప్రేక్షకుల నుంచి షాకింగ్ రెస్పాన్స్ వస్తోంది.
సినిమాలో ఫస్టాఫ్ యావరేజ్ అని.. సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందని సినీ ప్రియులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు. సెకండాఫే సినిమాను నిలబెట్టిందని చెబుతున్నారు. రామ్ ఎంట్రీ సీన్ థియేటర్స్ ను షేక్ చేసింది. అలాగే మాస్ క్యారెక్టర్ గా రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ అని.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మణిశర్మ చితక్కొట్టేశాడని అంటున్నారు. మణిశర్మ అందించిన బీజీఎం సినిమాకు ప్రాణం పోసిందట.
రామ్ మేనరిజమ్స్, మదర్ సెంటిమెంట్, పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్ కూడా సినిమాకు హైలెట్స్ గా నిలిచాయట. క్లైమాక్స్ ఎపిసోడ్, కావ్య థాపర్ అందాలు, సంజయ్ దత్ విలనిజం సైతం బాగున్నాయని చెబుతున్నారు. మైనస్ ఏదైనా ఉందా అంటే.. అది ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు.. అదే విధంగా అలీ కామెడీ అని అంటున్నారు. అలాగే చిప్ కాన్సెప్ట్ అనే ఐడియా బాగున్నా అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ గా ఆడియెన్స్ నుంచి డబుల్ ఇస్మార్ట్ కు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. కొందరు పూరి జగన్నాథ్-రామ్ హిట్ కొట్టేశారని అంటుంటే.. మరికొందరు పెద్ద గొప్ప సినిమా ఏమీ కాదని, వన్ టైమ్ వాచ్ ఫిల్మ్ అని అంటున్నారు.