ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏటా నిర్వహించే పార్టీ పసుపు పండుగ మహా నాడును ఈ సారి కడపలో నిర్వహించాలని తీర్మానం చేశారు. తాజాగా జరిగిన పొలిట్ బ్యూలో సమావేశం లో ఈ మేరకు నిర్ణయించారు. వాస్తవానికి గతంలో రాయలసీమలోనూ.. టీడీపీ మహానాడును నిర్వహించా రు. అయితే.. కడప జిల్లాలో మాత్రం నిర్వహించలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా బాబు ఈ ప్రకటన చేశారు.
వచ్చే మహానాడును మేలో నిర్వహించనున్న నేపథ్యంలోను, కడపను ఎంపిక చేసుకున్న తీరును గమ నిస్తే.. వైసీపీని భారీగానే టార్గటె్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీ కూటమి.. ఇప్పటి వరకు లక్షిత రాజకీయాలు చేసిన దాఖలేదు. కానీ, వైసీపీదూకుడును నిలువరించేం దుకు.. ముఖ్యంగా సీమలో తమకు కొంత ఇబ్బందికరంగా ఉన్న ఓటు బ్యాంకును సొంతం చేసుకునేం దుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఏం జరుగుతుంది..?
జగన్ ఇలాకాలో టీడీపీ మహానాడు నిర్వహిస్తే.. ఆ దూకుడు వేరేగా ఉంటుంది. వైసీపీ అధినేతపైనే కాకుండా.. పార్టీపైనా తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటి వరకు తిరుగులేదని భావించిన చోట.. సొంత జిల్లాలో వేరే పార్టీ అందునా ప్రత్యర్థి పార్టీ జెండా ఎగరేసేందుకు సిద్ధం కావడం.. వాస్తవానికి వైసీపీకి ఇబ్బందికర పరిణామమే. అయినా.. చంద్రబాబు దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. ఈ దఫా మహానాడుకు జగన్ సొంత జిల్లాను ఎంచుకున్నారంటేనే.. ఏదో ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
టార్గెట్ ఏంటి..?
జగన్కు బలంగా ఉన్న ఓటు బ్యాంకు..పులివెందుల సహా కడపలోని రెడ్డి సామాజిక వర్గం. వీరిని ఆకర్షిస్తే.. వైసీపీ బలం దాదాపు తగ్గిపోయినట్టే అవుతుంది. ఈ ప్రణాళికతోనే చంద్రబాబు నెమ్మదినెమ్మదిగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా ఇలా మహానాడును కడపలో నిర్వహించడం అనేది టీడీపీ హిస్టరీలోనే ఫస్ట్ టైం అని సీనియర్లు కూడా చెబుతున్నారు. తాజా నిర్ణయాన్ని మెజారిటీ నాయకు లు స్వాగతిస్తున్నారు. మొత్తానికి జగన్ కు ఈ దెబ్బతో టీడీపీ సత్తా తెలుస్తుందన్న వాదనా వినిపిస్తుండడం గమనార్హం.