టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన తొలి చిత్రం `గీత గోవిందం` విడుదలై నేటికి ఆరేళ్లు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ఆ వెంటనే గీత గోవిందంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించగా.. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై రూ. 5 కోట్ల బడ్జెట్ తో బన్నీ వాసు నిర్మించారు. గోపి సుందర్ సంగీతం అందించారు.
2018 ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం.. తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ చిత్రం అద్భుతంగా మెప్పించింది. అర్జున్ రెడ్డిలో యాంగ్రీ బాయ్ గా హడలెత్తించిన విజయ్.. గోత గోవిందంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెందిన ఓ పద్ధతైన యువకుడిగా అలరించారు. అతని లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ మరియు మేడం మేడం అంటూ హీరోయిన్ వెంటపడటం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
అలాగే గీత పాత్రలో రష్మిక నటనకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. విజయ్-రష్మిక రష్మిక కెమిస్ట్రీ, సాంగ్స్, కామెడీ ట్రాక్, ఫ్యామిలీ ఎలిమింట్స్.. ఇలా అన్నీ బాగా కుదిరాయి. టాక్ అనుకూలంగా ఉండటంతో గీత గోవిందం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఫుల్ రన్ లో రూ. 132 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను కొల్లగొట్టి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
ఇకపోతే గీత గోవిందంలో హీరోయిన్ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండ కాదు. డైరెక్టర్ పరశురామ్ మొదట ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలని భావించాడు. ఆయన్ను కలిసి స్టోరీని కూడా నెరేట్ చేశాడు. కానీ అల్లు అర్జున్ కు కథ అంతంగా నచ్చకపోవడం వల్ల సున్నితంగా రిజెక్ట్ చేశాడు. దాంతో అదే కథను పరశురామ్ విజయ్ దేవరకొండతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.