వైసీపీ నేతలు తప్పులు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేసినపుడు గమ్మునుండే ఏపీ పోలీసులు తెలుగుదేశం వాళ్లు ఆ పనులు ఎత్తిచూపితే ఎగేసుకుని అరెస్టులు చేస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
నిన్న బూతుల మంత్రి నాని నోటికొచ్చినట్లు మాట్లాడటంతో దానికి స్పందించిన తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న చంద్రబాబును తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
గౌతమ్ సవాంగ్ డీజీపీ గా ఉండి వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని, కొడాలి నాని అరాచకాలు చూస్తూ అరెస్టులు చేయడం లేదని, మీరు పదవి దిగిపోయాక వదిలిపెట్టేది లేదని అనడంతో వెంటనే అతన్ని అరెస్టు చేశారు.
దీనిపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.
‘‘గుడివాడలో కొడాలి నాని క్యాసినో నడిపితే నో పోలీస్..
అదే గడ్డం గ్యాంగ్ ప్రతిపక్షనేతని బూతులు తిడితే నో పోలీస్..
చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్.. టిడిపి కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్
బూతులేంట్రా సన్నాసి నాని అని బుద్ధా వెంకన్న గారు నిలదీస్తే బిలబిలమంటూ వచ్చి అరెస్ట్ చేశారు పోలీస్.
ఏపీ పోలీసులు ప్రజారక్షణకి ఉన్నారా?
నేరాలు చేసే వైసీపీ నేతలకు కాపలా కాస్తున్నారా?
బుద్ధా వెంకన్న అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
క్యాసినో వ్యవహారంపై టిడిపి నేతలు ఫిర్యాదు చెయ్యడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ గారు ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లిలా వైసీపీ కోసం పనిచేస్తారు?
వైసీపీలో చేరితే వాటాల్లేకుండా మీరే క్యాసినో నడుపుకోవచ్చు.‘‘
అంటూ నారా లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు.