మంచు మోహన్ బాబు, మంచు విష్ణులపై నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీనుపై చోరీ ఆరోపణలతో కేసు పెట్టడం, కులంపేరుతో దూషించారని, తన తల్లిని అవమానించారని నాగ శ్రీను ఆరోపించడంతో వ్యవహారం సీరియస్ అయింది. దీంతో, మంచు ఫ్యామిలీ తమ కులాన్ని దూషించిందని, వారు క్షమాపణలు చెప్పకుంటే ఉద్యమిస్తామని నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు హెచ్చరించారు.
ఈ వ్యవహారం సద్దుమణగకముందే…నాగ శ్రీను వ్యవహారంలోకి జాతీయ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఎంటరయ్యారు. ఈ క్రమంలోనే మోహన్ బాబుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు హీరో అయితే ఏంటని, ఆయనలాంటి సంపన్నులను ఎంతో మందిని చూశామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క శాతం జనాభా ఉండే సామాజికవర్గం నుంచి వచ్చిన నీవు 56 శాతం జనాభా ఉండే బీసీల గురించి చులకనగా మాట్లాడతావా? అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.
నాయీ బ్రాహ్మణులనే కాకుండా, యావత్ బీసీలను మోహన్ బాబు, విష్ణు అవమానించారని, వారు తక్షణమే మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మంచు కుటుంబం కోసం 12 ఏళ్లు పని చేసిన నాగ శ్రీనును కులం పేరుతో దూషించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోహన్ బాబు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మోహన్ బాబుకు ఆర్.కృష్ణయ్య ఇచ్చిన వార్నింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
https://youtu.be/3tkR2lA0YJM