నటసింహం నందమూరి బాలకృష్ణకు ముగ్గురు సంతానం. కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని.. కుమారుడు మోక్షజ్ఞ. బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ ఇటీవలె తన డెబ్యూ మూవీని అనౌన్స్ చేశాడు. చిన్న కూతురు తేజస్విని గత కొన్నేళ్ల నుంచి తన తండ్రి చేస్తున్న సినిమాల సెలక్షన్ లో కీలకంగా వ్యవహరిస్తోంది. త్వరలోనే నిర్మాతగా కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక పెద్ద కూతురు బ్రాహ్మణి విషయానికి వస్తే.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ఫారెన్ లో స్టడీస్ కంప్లీట్ చేసిన బ్రాహ్మణి.. లోకేష్ ను వివాహం చేసుకుని నారా వారింటికి కోడలు అయింది. ప్రస్తుతం బిజినెస్ ఉమెన్ గా సత్తా చాటుతున్నారు.
అయితే తాజాగా బ్రాహ్మణికి సంబంధించి ఎవరికీ తెలియని ఒక టాప్ సీక్రెట్ ను బాలయ్య రివీల్ చేశారు. గతంలో ఓ బడా డైరెక్టర్ మూవీలో హీరోయిన్ గా బ్రాహ్మణికి అవకాశం వచ్చిందట. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు మణిరత్నం. తాను హోస్ట్ చేస్తున్న `అన్ స్టాపబుల్` షోలో బాలయ్య ఈ విషయాన్ని బయటపెట్టారు. `డాకు మహారాజ్` ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగవంశీ గెస్ట్లుగా హాజరయ్యారు. అయితే ఈ షోలో తమన్ `మీ ఇద్దరు అమ్మాయిల్లో ఎవర్ని ఎక్కువ గారాబంగా పెంచారు?` అని ప్రశ్నించాడు.
అందుకు బాలయ్య బదులిస్తూ.. ఇద్దర్నీ గారాబంగానే పెంచానని, అయితే ఇంట్లో తాను ఎక్కువ భయపడేది బ్రహ్మణికే అని తెలిపారు. అలాగే `గతంలో ఒక సినిమా కోసం బ్రహ్మణి హీరోయిన్ గా నటిస్తుందా అని మణిరత్నం గారు నన్ను అడిగారు. సరే అని అదే విషాయన్ని నేను బ్రహ్మణికి చెప్పాను. మై ఫేస్ అంటూ సమాధానమిచ్చింది. నేను వదలకుండా అవునూ నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని చెప్పాను. చివరకు ఆమె ఆసక్తి లేదని చెప్పేసింది. రెండో కూతురు తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దం నిలబడి యాక్టింగ్ చేసేది. తనైనా నటి అవుతుందని అనుకున్నాను. ప్రస్తుతం ఈ షోకు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తుంది. ఎవరికి వారు మంచిగా సెటిల్ గా అయ్యారు. వాళ్ల తండ్రిని అని చెప్పుకునే స్థాయికి వచ్చారు` అంటూ బాలయ్య కూతుళ్ల గురించి చెప్పుకొచ్చారు.