అక్టోబరు 3వ తేదీన సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ వ్యవహారంపై దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరగనున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్, కేసు కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పిటిషన్ పై తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలని సుప్రీం కోర్టులో తాజాగా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, ఇరు పక్షాల వాదనలతో అక్టోబరు మూడో తేదీన సుదీర్ఘంగా సుప్రీం కోర్టులో వాదనలు జరిగే అవకాశముంది.