“ఆనాడు పోలీసు కస్టడీలో నా గుండెలపై కూర్చున్న వ్యక్తిని గుర్తించా. ఆ వ్యక్తి ఎవరనేది అందరికీ తెలి సిందే. అయితే.. ప్రస్తుతం న్యాయ విచారణ జరుగుతోంది. నిజా నిజాలు బయట పడతాయి“ – అని మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన గుం టూరులోని స్థానిక కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా నాడు వైసీపీ హయాంలో తనను పోలీసు కస్టడీకి తీ సుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.. తన గుండెలపై కూర్చుని ప్రాణాలు తీసేందుకు సైతం ప్రయత్నించా రని ఆనాడు రఘురామ పేర్కొన్నారు.
దీనిపై ప్రస్తుతం గుంటూరు జిల్లా కోర్టులో విచారణ సాగుతోంది. గుడివాడ నియోజకవర్గానికి చెందిన తుల సి బాబును ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక, ఈ కేసులో ఆరోపణలు ఎదు ర్కొంటున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ప్రస్తుతం పరారీలో ఉన్నా రనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం గుంటూరు కోర్టుకు వచ్చిన రఘురామ.. నిందితుడిని గుర్తించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన గుండెలపై కూర్చున్న నిందితుడిని తాను స్పష్టంగా గుర్తించానన్నారు.
అయితే, ఈ కేసు విషయంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నిందితుడు తులసి బాబుకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనపై కస్టడీలో దాడి చేసి, కొట్టిన ఏ-1ను ఎందుకు అరెస్టు చేయడం లేదో తనకు తెలియడం లేదని తెలిపారు. అసలు నిందితులు ఇంకా బయట తిరుగుతూనే ఉన్నారని చెప్పిన రఘురామ అవసరం అయితే ఆనాటి గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్‌ను కూడా విచా రించాలని కోరారు. అయితే.. వాస్తవాలు ఎప్పటికీ ఎవరూ దాచలేరని చెప్పారు.
2021-22 మధ్య అప్పటి వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ప్రభుత్వంపై కుట్ర పన్నారంటూ కేసులు పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న వాదన ఉంది. అప్పట్లో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్లడం.. సైనిక ఆసుపత్రిలో వైద్యం చేయించడం.. తెలిసిందే. ఇక, కూటమి సర్కారు వచ్చాక ఈ కేసు యూటర్న్ తీసుకుని, రఘురామను కస్టడీలో హింసించిన వారిపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.