2019లో చినబాబు చిరుతిండి అంటూ తనపై తప్పుడు కథనాన్ని ప్రచురించిన బ్లూ మీడియా సాక్షిపై మంత్రి నారా లోకేష్ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం విశాఖ వచ్చిన లోకేష్.. కోర్టులో మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు కథనాలు రాసి, అదే నిజమని నమ్మించడం వారి నైజామని సాక్షిపై లోకేష్ మండిపడ్డారు. కానీ నిజం తనవైపు ఉందని.. లేట్ అయినా నిజమే గెలుస్తుందని అన్నారు.
ఇదే తరుణంలో కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన డిప్యూటీ సీఎం ఇష్యూపై మీడియా ప్రశ్నించగా.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కార్తకర్తగానే ప్రజల కోసం పని చేస్తానని.. తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. ఒక పదవిలో ఒక వ్యక్తి మూడు టర్మ్‌లకు మించి ఉండకూడదనేది తన అభిప్రాయమని.. అందుకే జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను మరొకరికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నానని లోకేష్ వెల్లడించారు. పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలన్నారు.
విజయసాయిరెడ్డి రాజీనామా కూడా నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. జగన్‌పై తల్లి, చెల్లికే నమ్మకం లేదు.. ఇక నాయకులకేం ఉంటుందని అన్నారు. రాజీనామా చేసినంత మాత్రాన తప్పించుకున్నట్లు కాదని.. తప్పు చేసినవారెవరినీ వదిలిపెట్టమని లోకేష్ హెచ్చరించారు. కాకినాడ పోర్టుపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని.. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని లోకేష్ అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులు, నాయకులను వదిలేది లేదని.. ఒక్కొక్కటిగా అన్నీ చేస్తామని ఈ సందర్భంగా నారా లోకేష్ తెలియజేశారు.