డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం వ్యవహారం కలకలం రేపింది. అమలాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్ ఆత్మహత్యాయత్నం చేయడం జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం కిమ్స్లోని ఐసీయూలో వెంకటేష్ చికిత్స పొందుతున్నారు. వెంకటేష్ ను పలువురు వైసీపీ లీడర్లు, అమలాపురం మున్సిపల్ కమిషనర్ నాయుడు పరామర్శించారు.
అయితే, వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదే కారణమని తెలుస్తోంది. తన ఇంటిని కబ్జా చేసేందుకు వెంకటేష్ ప్రయత్నించారని పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో, మనస్తాపం చెందిన వెంకటేష్ సూసైడ్ చేసుకోబోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి గల కారణంపై ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు నోరు మెదపడం లేదు.