జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారంతా అధికారం కోల్పోగానే పార్టీ మార్చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైకిల్ ఎక్కేస్తున్నారు. ఆయన టీడీపీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ఉదయం 11 గంటలకు ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏలూరు నాయకులు సమాచారం వచ్చింది.
ఇదే విషయాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి కూడా వెల్లిడించారు. అయితే ఆళ్ల నాని చేరికను టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సంగతిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని బడేటి చంటి అన్నారు. అలాగే ఆళ్ల నానికి 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటికే ఆళ్ల నాని రాకపై హైకమాండ్ నిర్ణయం తీసేసుకుంది. అధిష్ఠానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నాని బడేటి చంటి తెలిపారు.
కాగా, ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. జగన్ కు అత్యంత సన్నిహితుడు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రెండు నెలల క్రితమే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి సైలెంట్ గా ఉంటూ టీడీపీ ముఖ్యనేతలకు టచ్ లోకి వెళ్లిన నాని.. తన ఎంట్రీకి రూట్స్ అన్నీ క్లియర్ చేసుకున్నారట. ఇక టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ రానప్పటికీ.. రాజకీయ భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగానే ఆళ్ల నాని సైకిల్ ఎక్కేస్తున్నారని సమాచారం.