బ్యాంకులతో మనకు నిత్యం పనే. అయితే ఎపుడూ బ్యాంకులు ఓపెన్ అయినట్లే ఉంటాయి గాని ఎపుడు అయినా మనకు సరిగ్గా అవసరం అనుకున్నపుడే వాటికి సెలవులు ఉంటే చిరాకొస్తుంది. మనం చేసే ప్రైవేటు ఉద్యోగాల్లో బ్యాంకు సెలవులు ఎపుడో తెలిసే అవకాశం తక్కువ.
సాధారణ రోజుల్లో పర్లేదు గాని.. ఈ ఏప్రిల్ నెల మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకులకు ఈ నెలలో సెలవులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ముందే తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే పర్లేదు లేకపోతే బుక్కయిపోతారు.
ఏప్రిల్ నెలలో బ్యాంక్ ఉద్యోగులకు చాలా సెలవులు ఉన్నందున బ్యాంకులు చాలా రోజులు పని చేయవని చెప్పుకోవాలి. అందువల్ల మీకు బ్యాంక్లో ఏమైనా ఉంటే.. బ్యాంకులు ఎప్పుడెప్పుడు పని చేయవో ముందే తెలుసుకోవడం ఉత్తమం.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం హాలిడే
ఏప్రిల్ 2 గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4 ఆదివారం
ఏప్రిల్ 5 జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 10 రెండో శనివారం
ఏప్రిల్ 11 ఆదివారం
ఏప్రిల్ 13 ఉగాది
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 ఆదివారం
ఏప్రిల్ 21 శ్రీరామ నవమి
ఏప్రిల్ 24 రెండో శనివారం
ఏప్రిల్ 25 ఆదివారం