బహిరంగసభలు, సుడిగాలి పర్యటలు అన్నింటినీ కేసీఆర్ వాయిదా వేసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అభ్యర్ధుల ప్రకటన పూర్తయిన తర్వాత వీలైనంత తొందరలోనే అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించాలని అభ్యర్ధులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత నరేంద్రమోడీ జమిలి ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించారు. దాంతో ఏమిచేయాలో కేసీయార్ కు దిక్కుతోచలేదు. అందుకనే ముందుగా పర్యటనలన్నింటినీ వాయాదా వేసుకున్నారు.
ఈనెల 18వ తేదీ నుండి 22వ తేదీవరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల నిర్వహణపై బిల్లు, చర్చలు, నిర్ణయం ఉంటుందనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. జమిలితో పాటు ఇంకే అంశాలు పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వస్తాయన్నది తెలీలేదు. కాబట్టి జమిలి ఎన్నికలు అన్నది చాలా కీలకమైపోయింది. సో కనీసం అంతవరకు అన్నా తన పర్యటనలను వాయిదావేసుకోవాలని కసీయార్ డిసైడ్ అయినట్లు సమాచారం.
నిజానికి జమిలి ఎన్నికలపై మోడీ ఆలోచనలను ప్రతిపక్షాల్లో ఏది కూడా పసిగట్టలేదు. ఇందులో భాగంగానే కేసీయార్ కు కూడా షాక్ ట్రీట్మెంట్ లాంటిదనే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే వెంటనే మహారాష్ట్ర, ఏపీలో ఎన్నికలపై దృష్టిపెట్టాలని కేసీయార్ చాలా ప్లాన్లు వేసుకున్నారు. ఇపుడా ప్లాన్లన్నీ వృధా అయిపోయాయి. అన్నింటినీ తిరగతిప్పి వేసుకోవాల్సందే. ఎలాగూ 22వ వరకు పార్లమెంటు సెషన్ జరుగుతుంది కాబట్టి ఈలోగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలని అనుకున్నారు.
అలాగే నియోజకవర్గాల్లో అసంతృప్తులతో మాట్లాడటం, వాళ్ళకి హామీలిచ్చి దారిలోకి తీసుకురావటం లాంటి వాటిపై దృష్టి పెడితే బాగుంటుందని అనుకున్నారు. ఎందుకంటే ఇపుడు పర్యటనలు చేసినా ఎలాంటి ఉపయోగాలు ఉండవు. అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా షెడ్యూల్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయించే అవకాశముంది. అదే జరిగితే అప్పుడు తెలంగాణా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో జరగవు. ఇంకా ఆలస్యమవుతాయి. ఇపుడు ప్రకటించిన అభ్యర్ధులు కూడా మారిపోయే అవకాశాలున్నాయి. మరి కేసీయార్ చివరకు ఏమిచేస్తారో చూడాల్సిందే.