దావోస్ సదస్సు ద్వారా.. భారీ ఎత్తున పెట్టుబడులు దూసుకువచ్చి.. రాష్ట్రంలో మరింత పేరు తెచ్చుకు నేందుకు ఏపీ సీఎం, కూటమికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు భావించారు. అందుకే.. గత రెండు మాసాల నుంచి కూడా దావోస్ పర్యటనపై ప్రత్యేక ప్రకటనలు కూడా చేశారు. మొత్తంగా ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించే పెట్టుబడుల సదస్సు.. శుక్రవారం(ఈ రోజు)తో ముగియ నుంది. ఈ క్రమంలో చంద్రబాబు బృందం ఎన్ని పెట్టుబడులు సాధించిందన్న ప్రశ్న తెరమీదికి వస్తుంది. దీనిపై చర్చ కూడా జరుగుతుంది.
దావోస్ పర్యటనపై అనేక ఆశలు పెట్టుకున్న చంద్రబాబు బృందం.. దీనిని చాలా సీరియస్‌గానే తీసు కుంది. పెట్టుబడులకు ఏపీని గమ్య స్థానంగా మార్చాలని కూడా నిర్ణయించుకుని.. ఆ దిశగానే ప్రయత్నా లు చేసింది. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, టీజీ భరత్‌లు.. తమ వంతు ప్రయత్నాలు చేశారు. కానీ, అనుకున్న విధంగా అయితే.. పెట్టుబడులు దూసుకురాలేదు. నాలుగు రోజుల్లో వచ్చిన మొత్తం పెట్టుబ డులు 15 వేల కోట్లను దాటకపోవడం గమనార్హం. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు అనేది ప్రభుత్వం లో చర్చగా మారింది.
మొత్తంగా జరిగిన ప్రయత్నాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ, ఎక్కడో తేడా కొట్టిందన్న చర్చ అయితే జరుగుతోంది. దీనిపై కూపీ లాగిన టీడీపీ నాయకులకు భారీ సమాధానమే లభించినట్టు తెలిసింది. దావో స్ సదస్సు జరుగుతున్న సమయంలో స్విస్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కథనా లు వచ్చాయని ఇవి పెట్టుబడులపై ప్రభావం చూపించాయన్నది సందేహం. సాధారణంగా.. ఇప్పుడు ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లోనే తెలుస్తోంది. ఇప్పుడు స్విస్ మీడియాలోనూ ఏపీలో జరుగు తున్న పరిణామాలపై కథనాలు వస్తున్నాయన్న వాదన ఈ సందర్భంగా గమనార్హం. కానీ, దీని వెనుక వైసీపీ కుట్రలు ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దావోస్ సదస్సు జరుగుతున్న సమయంలోనే స్విస్ మీడియాలో కథనాలు రావడం.. ప్రకటనలు కూడా రావడం వంటివి పెట్టుబడులపై ప్రభావం చూపించి ఉంటాయని అనుమానిస్తున్నారు.
దీంతోనే పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించే పరిస్థితి వచ్చిందన్న చర్చ సాగుతోంది. లేకపోతే.. తెలంగా ణకు మించిన పెట్టుబడులు వచ్చి ఉండేవని అంటున్నారు. మరి ఇది కనుక నిజమే అయితే.. ఏపీ అభి వృద్ధి విషయంలో వైసీపీ చేసింది తప్పే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.