టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అగ్రనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం మదనపల్లిలో కొనసాగుతోంది. యువగళం పాదయాత్ర 40వ రోజు మదనపల్లి శివారు దేవతానగర్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పట్టణ వీధులన్నీ పసుపుమయ్యాయి. మదనపపల్లిలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఈ సభ సందర్భంగా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేరారు. సభా వేదికపైనే షాజహాన్ బాషాకు పసుపు కండువా కప్పి పార్టీలోకి లోకేష్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా షాజహాన్ బాషా సోదరుడు, వైసీపీ నేత నవాజ్ బాషాపై లోకేష్ నిప్పులు చెరిగారు. నవాజ్ బాషా, ఆయన అనుచరులు కలిసి ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల్లో లేఅవుట్లు వేశారని, 100 కోట్లు దోచుకున్నారని లోకేష్ ఆరోపించారు. మదనపల్లిలో లే అవుట్ వేయాలంటే ఆయనకు కప్పం కట్టాలని, 557 ఎకరాలున్న సీటీఎం చెరువులో నవాజ్ బాషా, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, వారి అనుచరులు 40 ఎకరాలు కాజేశారని ఆరోపించారు.
మదనపల్లికి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అధికారిక ఎమ్మెల్యే నవాజ్ బాషా అయితే అనధికార ఎమ్మెల్యేలు పాపాల పెద్దిరెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. నవాజ్ బాషా తన బినామీలతో బెంగళూరు బస్టాండ్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ నుండి నెలకు 5 లక్షలు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. పెద్దిరెడ్డికి 50 శాతం కమిషన్ ఇవ్వాలని, 2024 నాటికి దొరికిన భూమి, కొండలు, చెరువులు కూడా స్వాహా చేస్తారని దుయ్యబట్టారు.
రేపు తంబళ్లపల్లి నియోకవర్గంలో ఉంటానని, చిత్తూరు జిల్లాకు ఎవరేం చేశారో చర్చించేందుకు రావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లోకేష్ సవాల్ విసిరారు. చిత్తూరును పెద్దిరెడ్డి కుటుంబం నమిలేస్తోందని ఆరోపించారు. జిల్లా వాళ్ల చేతిలో ఉండాలని మదనపల్లిని జిల్లా కాకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు.
టిడిపిలో చేరిన మదనపల్లి వైసిపి ఎమ్మెల్యే నవాజ్ బాషా సోదరుడు, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా.
బహిరంగ సభలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేష్.#YuvaGalamPadayatra pic.twitter.com/K9B2pa6Z2C
— Tdp Trending (@tdptrending) March 10, 2023