రాజకీయ నేతలకు.. అత్యంత ప్రముఖ వ్యాపారులకు కల్పించే `వై` కేటగిరీ భద్రత ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్‌కు కల్పించే అవకాశం కనిపిస్తోంది. ఆయనే ఇటీవల వచ్చిన సంచలనాత్మక వాస్తవ కథతో రూపొందిన `ది కశ్మీర్ ఫైల్స్` చిత్ర దర్శకుడు వివేక్.
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సంచలనాత్మకంగా దూసుకుపోతున్న సినిమా `ది కశ్మీర్ ఫైల్స్`. వాస్తవానికి వారం కిందటే విడుదలైన ప్పటికీ.. ఈ సినిమా నెమ్మదిగా పుంజుకోవడం గమనార్హం. ప్రస్తుతం 100 కోట్ల రూపాయల క్లబ్బులోకి చేరే దిశగా దూసుకుపోతోంది.
ఇక, సినిమా పరంగా చూసుకుంటే.. దీనిపై అనేక మంది విమర్శలు చేస్తున్నారు. చరిత్రాత్మక కథతో ముఖ్యంగా కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంతో సాగిన ఈ కథనంపై ప్రకాశ్‌రాజ్ సహా బాలీవుడ్ దిగ్గజాలు కొందరు విమర్శలు సంధించారు. కథ ఏకపక్షంగా ఉందని.. చరిత్రకారులు సైతం పేర్కొన్నారు.
మొత్తంగా ఈ విమర్శల సుడులు పెరుగుతున్న కొద్దీ ఈ సినిమా దర్శకుడు.. వివేక్ అగ్నిహోత్రి చుట్టూ.. వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్‌కు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. దర్శకుడు వివేక్‌కు ఏకంగా `వై` కేటగిరీ భద్రతను రికమండ్ చేశారు. ఈ కేటగిరీలో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ జవానులు.. వివేక్‌కు రక్షణ కల్పిస్తారు. అయితే.. ఇలా వై కేటగిరీ భద్రత కల్పించడం బాలీవుడ్‌కు కొత్తకాదు. దీనికి ముందు.. వివాదాస్పద నాయకి.. కంగనా రనౌత్‌కు కూడా ఈ తరహా భద్రతను కల్పించారు. బాలీవుడ్ మాఫియాపై ఆమె మాట్లాడిన తీరుతో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆమెకు వై కేటగిరీ భద్రత ఇచ్చారు.
ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం.. చూసిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కథను చూస్తే.. కశ్మీర్ వ్యాలీలో చోటు చేసుకున్న విధ్వంసాల నేపథ్యంలో అక్కడ నుంచి హిందువులు వేరే ప్రాంతాలకు తరలిపోయారు. అదేసమయంలో ఎమర్జన్సీ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా చిత్రంలో ప్రముఖంగా చూపించారు. ఈ నెల 11న విడుదలైన సినిమాను కేంద్ర కేబినెట్లోని మంత్రులు అందరూ చూడడం గమనార్హం. అంతేకాదు.. సాక్షాత్తూ.. ప్రధాని మోడీ.. ఈ సినిమా బాగుందంటూ.. కితాబునివ్వడమే కాకుండా.. అందరూ చూడాల్సిన సినిమా అంటూ.. సిఫార్సు చేయడం గమనార్హం.