ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక ట్వీట్ తో అడ్డంగా బుక్కయ్యారు. నేడు రాఖీ పండుగ కావడంతో జగన్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ద్వారా ఒక ట్వీట్ చేశారు. `నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతాను.` అంటూ ట్వీట్ లో జగన్ పేర్కొన్నారు.
అయితే ఈ ట్వీట్ ఇప్పుడు ట్రోలింగ్ కు గురవుతోంది. సొంత చెల్లి షర్మిలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయం చేసి ఆమెను బాధపెట్టిన జగన్.. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలందరికీ తోడుగా ఉంటానడం కామెడీగా ఉందంటూ నెటిజన్లు, టీడీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత చెల్లిని బజారులో నిలబెట్టి కూలి కుక్కలతో బూతులు తిట్టించిన నువ్వే చెప్పాలి ఈ 420 మాటలు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.
రక్తం పంచుకుపుట్టిన షర్మిలను అసలు వైఎస్‌కే పుట్టలేదని ప్రచారం చేయించిన నీచపు జగన్ కు రాఖీ గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడుతున్నారు. ఇంకొందరైతే `ఇంతకీ నీ సొంత చెల్లెలు నీకు రాఖీ కట్టిందా జగన్ మావయ్యా?` అంటూ వ్యంగ్యంగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఒక్క ట్వీట్ తో జగన్ అటు ట్రోలర్స్ కు, ఇటు రాజకీయ ప్రత్యర్థలకు అడ్డంగా దొరికేశారు.
నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2024