జగన్ సీఎం అయితే దళితులు మరింత బాగుపడతారన్న ఆశతో ఏపీలో జగన్ తరఫున గత ఎన్నికల్లో విపరీతంగా ప్రచారం చేసిన దళిత యువనేతల్లో మహాసేన రాజేష్ ది కీలక పాత్ర.
ఆయన లాంటి పలువురు చేసిన పోరాటం, జగన్ ఇచ్చిన సీపీఎస్ రద్దు, ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి వంటి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు. కానీ జగన్ విశ్వరూపం అర్థమైన లెంపలేసుకుని తప్పుదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ మహాసేన రాజేష్ జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతల అరాచకాలను ప్రజలకు వారు చేస్తున్న ద్రోహాన్ని ప్రతిదీ సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెడుతున్నారు.
తాజాగా ఆయన చేసిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది కొంచెం లెంగ్తీ వీడియో అయినా… మస్ట్ వాచ్ వీడియో. మీరు చూడటం మొదలుపెడితే రాజేష్ చెప్పిన అంశాలతో షాకులే షాకులు.
ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో గురించి కొందరు నెటిజన్లు చేసిన కామెంట్లు చూస్తే ఈ వీడియో మీరు తప్పకుండా చూస్తారు.
జై భీమ్ జై మహా సేన రాజేష్,, మీరు చెప్పిన విషయం చాలా గొప్పది, టీడీపి, జనసేన , మహసేన కలసి ఈ రాక్షస సంహారం చేయాలి
కచ్చితమైన్ వాస్తవం చెప్పారు ఈ ఇద్దరు కలిస్తే రాష్ట్రాన్ని,ప్రజలను కాపాడిన వారు అవుతారు లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు అది తెలుసుకుంటే మంచిది
పోలీసుల చేత వాళ్ళ భాధ్యతల్ని వాళ్ళచేత బలవంతంగానైనా నిర్వర్తించే లా చేయాలంటే మీరు చెప్తున్నది అత్యవసరం. మీ ఆలోచనకు ధన్యవాదాలు
బాగా చెప్పారు అన్నా ప్రజలను కాపాడవలసిన భాద్యత ప్రతిపక్షలపైన ఉంది కళ్ల ముందు ఇంత చట్టాన్ని, రాజ్యాంగాన్ని అతిక్రమించి పాలన చేస్తుంటే కేంద్రం దృష్టికి, హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లావలసిన భాద్యత ప్రతిపక్షాల వారిదే
నీ స్థాయి నీకు తెలియడం లేదు బాయ్, నువ్వు చాలా తెలివైన మంచి విలువలు కలిగిన వాగ్దాటి ఉన్న వాడివి, రాజేష్ నీకు ఎంతో భవిష్యత్తు ఉంది
రాజేష్ అన్న మంచి ఆలోచన ఇచ్చాడు. టీడీపీ, జనసేనవారు తప్పనిసరిగా రాజేష్ అన్న చెప్పినట్టు jac ఏర్పాటు చేసి మీ క్యాడర్ ను కాపాడుకోవలసిన అవసరం ఎంతఐనా ఉంది….. జైభీమ్… జై మహాసేన