మిల్వాకిలో పసుపు మరియు జన సైనికులు వారి కుటుంబ సభ్యులు కలయకతో ఆత్మీయ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యమాన్ని విజయవంతం చేయడానికి టీడీపీ-జనసేన కార్యకర్తలు కార్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జూమ్ కాల్స్ ద్వారా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆళ్లగడ్డ మాజీ శాసన సభ్యులు మరియు Ex మినిస్టర్ భూమా అఖిల ప్రియ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ మరియు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం? మన రాష్ట్రాన్ని జనసేన తో కలిసి ఎలా కాపాడుకోవాలి, చంద్రబాబు విజన్, రాష్ట్రంలోని దుష్ట పరిపాలనను తుడముట్టించి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తిరిగి నిలబెట్టుతుందని, అభివృద్ధి పథంలో మళ్ళీ ముందుకు దూసుకుపోతుంది అని
ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగు NRI తేజం యశస్వి బొద్దులూరి (Yash) విచ్చేసి ఆయన ప్రసంగాలతో ఉర్రూతలూగించారు మరియు అందరం కలిసి కట్టుగా ఒక సైకో ని రాష్ట్రంనుండి ఎలా తరిమేయాలి అని వివరించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లోని దుర్మార్గపు పరిపాలని పారదోలాలి అని టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రంలో మిల్వాకి నుండే కాకుండా చికాగో నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడం లో మిల్వౌకే NRI టీడీపీ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ అల్లు, ఫణి గారపాటి, ప్రవీణ్ పిన్నమనేని, రాంబాబు జవ్వాజి, హరేంద్ర రుద్రరాజు, దుర్గా బండారుపల్లి, శ్రీధర్ దొడ్డ, వికాస్ రావి మరియు వెంకట్ చిగురుపాటి అలాగే జనసేన నాయకులు దుర్గ రబ్బా, సుధీర్ నల్లముడి, బాలాజీ, బోసు, రఘు, వెంకట్ ఏరుబండి, రోహిత్, ఈశ్వర్, MN రావు మరియు ఇతర టీడీపీ-జనసేన కుటుంబ సభ్యులు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గుని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి చాలా కృషి చేశారు.