గతంలో రెండేళ్ల కిందట టీడీపీ అధినేత చంద్ర బాబు పార్టీ చేపట్టిన ` బాదుడే బాదుడు` కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన నందిగామలో నడిరోడ్డుపై వాహనంలో నిలబడి ప్రసంగిస్తున్న సమ యంలో కొందరు అల్లరి మూకలు(వైసీపీ కార్యకర్తలని టీడీపీ నాయకులు ఆరోపించారు. నిజం నిర్ధారణ కాలేదు) చంద్రబాబు కేంద్రంగా రాళ్లు రువ్వారు. అయితే.. అదృష్టవ శాత్తు చంద్రబాబుకు తగలలేదు. కానీ, ఆయన భద్రతా సిబ్బంది చీఫ్ మాత్రం గాయపడ్డారు.
కట్ చేస్తే.. ఈ ఘటనపై అప్పట్లో డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్ రెండు రోజుల తర్వాత.. ప్రెస్మీట్ పెట్టి.. “ఔను.. చంద్రబాబు రోడ్ షోలో రాళ్లు పడ్డాయి. దీనిని ఎవరు అడ్డుకుంటారు. ఇది భావప్రకటనా స్వచ్ఛగా ఎందుక భావించకూడదు. నోటికి స్వేచ్ఛ ఉన్నట్టే చేతలకు కూడా స్వేచ్ఛ ఉందని అనుకోవచ్చు. ఎవరు విసిరారో చెబితే.. వారిపై కేసులు పెడతాం“ అని చిత్రమైన వ్యాఖ్యలు చేశారు.
రెండో సారి కట్ చేస్తే.. తాజాగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మేం సైతం సిద్దం పేరుతో ఆయన ప్రజల్లోకి వస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఎవరో ఆకతాయిలు.. చెప్పులు విసిరారు. ఇవి జగన్కు తగలలేదు. కానీ.. ఆయనను లక్ష్యంగా చేసుకున్నవే కదా! దీంతో వైసీపీ హర్ట్ అయింది. కానీ, విమర్శించే స్కోప్ లేకుండా పోయింది.
ఆ నాడు చంద్రబాబుపై రాళ్లు విసిరినప్పుడే.. కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడు చెప్పులు విసిరే పరిస్థితి వచ్చి ఉండేది కాదని.. ఎవరు చేసుకున్న ఖర్మ వారు అనుభవించాల్సిందేనని జనాలు అంటున్నారు. అంతేకానీ, సీఎం జగన్ పై చెప్పులు విసిరారా.. అయ్యో పాపం.. అనే సానుభూతి మచ్చుకు విందామని వైసీపీ నాయకులు చెవులు రెక్కించినా.. రాష్ట్రంలో ఎక్కడా ఆ తరహా సానుభూతిరాకపోవడం గమనార్హం.