నోటికొచ్చిన అబద్ధాలు ఆడటంలో రారాజు సాయిరెడ్డి.
ఉన్నది లేనిది కల్పంచి చెప్పేస్తుంటాడు.
చంద్రబాబును, లోకేష్ తిట్టకుండా ఆయనకు పొద్దుపోదు.
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల కింద డబ్బు పంచుడు అనే కార్యక్రమం తప్ప ఇంకోటి జరగలేదు. పాండెమిక్ ని దారుణంగా తక్కువ అంచనా వేసి ఏపీ ప్రజల కొంప ముంచారు.
ఆక్సిజన్ లేక 5 వేర్వేరు ఆస్ప్త్రుల్లో వేర్వేరు రోజుల్లో పదుల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారంటే… ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఇంతవరకు ఏపీ ఆస్పత్రుల్లో డిమాండ్, అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు చేయగలిగిన పర్యవేక్షక కమిటీనే ప్రభుత్వం వేయలేదు. అలాంటిది ఏపీ లో జగన్ అద్భుతంగా ఆస్పత్రులను తీర్చిదిద్దాడు అని సాయిరెడ్డి గత ఏడాది ఒక పెద్ద పచ్చి అబద్ధం చెప్పాడు.
ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆస్పత్రే కావాలా? ఏం ఈఎస్ఐ ఆస్పత్రి వద్దా? మీ CBN హయాంలా కాదు జగన్ గారి ప్రభుత్వం. ఆస్పత్రులకు అన్ని హంగులు అద్దింది. సమస్య వస్తే చూసుకుంటుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 7, 2020
కట్ చేస్తే ఆ నెల తర్వాత కోవిడ్ వచ్చి సాయిరెడ్డి ఏపీలో చేరకుండా హైదరాబాదులో చేరాడు.
అది పక్కన పెడితే ఏడాది క్రింద కాదు కదా, ఇప్పటికీ ఆస్పత్రులను జగన్ ప్రభుత్వం బాగు చేయలేదు. హైదరాబాదు వంట సదుపాయాలు మా వద్ద లేవు అని స్వయంగా పార్టీలో కీలక శక్తి అయిన సజ్జల సెలవిచ్చారు. దీంతో సాయిరెడ్డి గాలి తుస్సు ముంది.
అంటే వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేసే పచ్చి అబద్ధాలు చెబుతారని వారి నోటితోనే ప్రూవ్ అయ్యిందిగా ఇపుడు?