2019 కాన్ఫరెన్స్ ఫండ్ రైజింగ్ కమిటీ చైర్మన్ గా, ‘తానా’ ఫౌండేషన్ సెక్రెటరీ గా, భూరి విరాళాల దాత గా ‘తానా’ కి విశేష సేవలందిస్తున్న ‘రవి మందలపు’ కి మరో పెద్ద బాధ్యతను ‘తానా’ అప్పగించింది .
ఇప్పటివరకు ఉన్న ‘తానా’ కాన్ఫరెన్స్ చైర్మన్ అనే పేరును, కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా మార్చి మరీ ఈ క్లిష్టమైన పదవిని అప్పచెప్పడం ‘రవి మందలపు’ ఇప్పటివరకు చేసిన సేవలకు గుర్తింపుగా చెప్పవచ్చు.
‘నమస్తే ఆంధ్ర’ తో మాట్లాడుతూ, ఈ బాధ్యతని అప్పచెప్పిన ప్రెసిడెంట్ అంజయ్య లావు కి కృతక్షలు చెప్పుతూ, ఈ కాన్ఫరెన్స్ ని కూడా విజయవంతం చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.
‘తానా’ శ్రేయోభిలాషులు, మిత్రులు ‘రవి మందలపు’ ని అభినందించారు.