టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటులు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు సేవాగుణంలోనూ పది అడుగులు ముందే ఉంటారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల్లో భాగమైన రామ్ చరణ్.. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. పుట్టుకతోనే పల్మనరీ హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న పసి ప్రాణాన్ని రామ్ చరణ్ కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ కు చెందిన ఓ జర్నలిస్ట్ దంపతులకు ఆగస్టు 22న ఒక చిన్నారి జన్మించింది. పాప పుట్టిందని ఆనంద పడేలోపే ఆ దంపతుల గుండెల్లో పిడుగులాంటి వార్త పడింది. పుట్టుకతోనే పాపకు సీరియస్ హార్ట్ కండిషన్ ఉంది. పల్మనరీ హైపర్ టెన్షన్ తో బాధపడుతుంది. బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో.. ఆ తల్లిదండ్రులను తమ పాపను మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
కానీ అక్కడ పాప ట్రీట్మెంట్ కోసం లక్షల్లో వెచ్చించాల్సి రావడంతో.. తండ్రి తల్లడిల్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్.. పాప చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తాను భరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చాన మాట ప్రకారం.. సదరు చిన్నారికి ఉచితంగా కావాల్సిన ట్రీట్మెంట్ మొత్తం ఇప్పించారు. 53 రోజులు చికిత్స అనంతరం పాప కోలుకుంది. అక్టోబర్ 16న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయింది. సమయానికి వైద్యం అందడం, పాప కోలుకోవడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రామ్ చరణ్ చేసిన ఈ హెల్ప్ ను తాజాగా నిర్మాత ఎస్కెఎన్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో.. మెగా ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఆయన్ను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయ అంటూ కొనియాడుతున్నారు.
Kudos to Global star @AlwaysRamCharan garu 🤗 ❤️
On August 22, a baby girl was born with a serious heart condition (Pulmonary Hypertension), and her family couldn’t afford treatment. Global Star #RamCharan garu stepped in to ensure she received the care she needed. He inquired… pic.twitter.com/GyzNt6wRIB— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 16, 2024