తండ్రిని అడ్డం పెట్టుకుని, నాడు జగన్ రెడ్డి చేసిన “ధనయజ్ఞమే”, నేడు రాష్ట్రానికి శాపం…
నిన్న పులిచింతలలో గేటు కొట్టుకుని పోయింది కదా ? ఇది ఎవరి ఘనకార్యం, దీని వల్ల నష్టం ఏమిటి, ఎంత పెద్ద ప్రమాదం నిన్న విజయవాడకు తప్పింది, భవిష్యత్తులో ఏమి అవుతుంది, లాంటి వివరాలు చూడండి.
మొత్తం 24 గేట్లు ఉన్న ఈ పులిచింతల ప్రాజెక్ట్ లో, 16వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. గేటు పైకి ఎత్తి, నీళ్ళు వదులుతూ ఉండగా, వరద ఉదృతికి గేటు కొట్టుకుపోయింది. అదేంటి, ఇలా గేటు కొట్టుకుపొతే ప్రమాదం కాదా అనుకుంటున్నారా ?
మామూలు ప్రమాదం కాదు. విజయవాడ సగం కొట్టుకుని పోయేది. ఆరు లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే ,కృష్ణలంక సగం మునుగుతుంది. 2009లో 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తే విజయవాడ వణికిపోయింది. అలాంటిది పులిచింతలలో, 45.77 టిఎంసి నీళ్ళు ఉంటాయి, ఇవి అన్నీ ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్ లాగా ప్రకాశం బ్యారేజీ మీద పడితే ? ఊహకు అందని విధ్వంసం జరుగుతుంది. నిన్న ఒక్క గేటు కొట్టుకుపోయింది కాబట్టి సరిపోయింది.
మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్ట్ విషయంలో, గేటు కొట్టుకుని పోవటం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఇప్పుడు రీల్ వెనక్కు తిప్పి, తండ్రిని అడ్డం పెట్టుకుని, ఒక సుపుత్రుడు సాగిస్తున్న ధనయజ్ఞం టైంకు వెళ్ళాల్సిందే.
అది 2004, ధనయజ్ఞం, సూట్ కేసు కంపెనీలు మొదలైన కాలం. జగన్ మోహన్ రెడ్డి, తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టు దోచుకున్న కాలం అది. అందులోని ఒకటి ఈ పులిచింతల. తనకు ముడుపులు ముడితే చాలు, జనాలు ఎలా పొతే నాకేం అనే జగన్ రెడ్డి వైఖరితో, నాడు తండ్రిని అడ్డం పెట్టుకుని, ఈ ప్రాజెక్ట్ ను 2004లో శ్రీనివాస కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అండ్ హైదరాబాద్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇచ్చారు. ఈ రోజు సాక్షిలో రాసినట్టు, అది చంద్రబాబు 2003 ఇవ్వలేదు. ఇది పచ్చి అబద్ధం. తనకు కావాల్సిన కంపెనీకి ఇచ్చి, డిజైన్ ఖరారు మొదలుకొని పనుల వరకూ అన్నింటిలో రాజీ పడ్డారు. నిపుణుల కమిటీ లోపాలను ఎత్తిచూపినా, పట్టించుకోలేదు.
అప్పటి కాంట్రాక్టర్ తో కుమ్మక్కు అయ్యి, జగన్ రెడ్డి, ఎలా పులిచింతలలో దోచుకున్నాడు ?
1. సొమ్ములకు కక్కుర్తి పడి, రాజీ పడి, గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్‌లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్ గరిష్ఠంగా ఆరు మిల్లీమీటర్లకు మించి ఉండకూడదని తెలిసినా, పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా పెట్టారు. దీంతో గేట్ల పై ఒత్తిడి పెరిగింది. మొత్తంగా సివిల్ పనుల్లో, మెకానికల్ పనుల్లో కూడా లోపాలతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసారు.
2. 754.59 మీటర్ల దూరం స్పిల్‌వే నిర్మించాల్సి ఉండగా, 546 మీటర్లకు తగ్గించారు.
2. ఇక మరొకటి, డబ్బులు దొబ్బటానికి వరద తట్టుకునేందుకు, 33 గేట్లు పెట్టాల్సి ఉండగా, కేవలం 24 గేట్లు పెట్టారు.
3. కాంక్రీటు డ్యాం నిర్మించాల్సి ఉండగా, 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు.
4. ఇక ఈ ప్రాజెక్ట్ ఖర్చు, 2005లో ఇచ్చిన పరిపాలనా అనుమతి కంటే 300% పెరిగి, మొత్తం జగన్ రెడ్డి జేబులోకి వెళ్ళింది.
ఇలా కేవలం సొమ్ముల కోసం డిజైన్ మార్చి, స్పిల్ వే తగ్గించటం, గేట్లు తగ్గించటం, కాంక్రీటు డ్యాం లేకుండా మట్టి మట్టికట్ట నిర్మాణం చేయటంతో, మొత్తంగా ఈ రోజు వరద ఉదృతికి, గేటు కొట్టుకుపోయింది.
అందుకే చంద్రబాబు ప్రభుత్వం, ఈ నాసిరకం పనులు దృష్టిలో పెట్టుకునే, పూర్తిస్థాయిలో నీటిని నిల్వను ఎప్పుడూ చేయలేదు. జాగ్రత్తగా ఫ్లడ్ మానిటర్ చేస్తూ, డ్యాంను కాపాడుతూ వచ్చారు.
అయితే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ కు కానీ, బెట్టింగ్ మంత్రి అనిల్ కు కానీ, వీటి మీద అవగాహానే లేదు. వరద వస్తుంది కదా, నింపెద్దాం అని ఫుల్ గా నింపి పెట్టుకున్నారు. పై నుంచి వరద వస్తున్నా ఫ్లడ్ కుషన్ మైంటైన్ చేయలేదు. దీంతో ఎక్కువగా నీరు నింపటం, ఫ్లడ్ కుషన్ మైంటైన్ చేయకపోవటంతో, నాసిరకం గేట్లు ఆ వరద ఉదృతికి తట్టుకోలేక పోయాయి. దీంతో గేటు కొట్టుకుపోయింది.
ఈ అసమర్ధ, దద్దమ్మల వల్ల నష్టం ఏమిటి ?
పులిచింతలలో దెబ్బతిన్న గేటును మళ్లీ బిగించాలంటే, నీటి ప్రవాహం భారీగా తగ్గాలి, దీంతో గేటు పెట్టాలి అంటే, నాలుగైదు నెలలు పడుతుందని అంచనా. అంటే అప్పటి వరకు నీటి నిల్వ కుదరదు, మొత్తం సముద్రపు పాలు అవుతుంది. పులిచింతల నుంచి వదిలే నీళ్ళు, ప్రకాశం బ్యారేజికి వస్తాయి. అక్కడ నీళ్ళ నిలుపుదల సామార్ధ్యం లేదు కాబట్టి, మొత్తం సముద్రపు పాలు అవుతాయి. ఈ నీటి సంవత్సరాన్ని రైతులు కోల్పోయినట్లే. ప్రస్తుతం 34 టీఎంసీల పులిచింతల నుంచి ఖాళీ అవుతాయి అంటున్నారు, అంటే ఏకంగా 3.40 లక్షల ఎకరాల సాగుకు అవసరమయ్యే నీటిని వృథా చేసుకుంటున్నట్లు భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 70 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలోకి వెళ్లిపోయాయి. తెలంగాణకు తాకట్టు పెట్టి, విద్యుదుత్పత్తి రూపంలో విలువైన సాగునీటిని నష్టపోతే ఇప్పుడు జగన్ రెడ్డి అసమర్ధతో నష్ట పోతున్నాం.
సహజంగా ప్రతి వేసవిలోనూ రిజర్వాయర్ల గేట్ల పనితీరుపై ఇంజనీరింగ్ అధికారులు పరిశీలన చేసి,గడ్డర్లు, టైప్లేట్స్, నట్లూ, బోల్టులూ పటిష్ఠంగా ఉన్నాయో లేవో తనిఖీ చేసి, గేట్లకు గ్రీజు రాయడంతోపాటు రంగులు కూడా వేస్తారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా బడ్జెట్‌నే కేటాయిస్తారు. ఈ దద్దమ్మ పాలనలో అలాంటివి ఏమి జరగలేదు. అప్పులు తెచ్చి దొబ్బటమే కానీ, ఎక్కడా ప్రాజెక్ట్ ల కోసం రూపాయి ఖర్చు పెట్టటం లేదు.
జగన్ రెడ్డి అసమర్ధత, నిర్ల్యక్షం ఇలాగే కొనసాగితే, ఈ రోజు పులిచింతల గేటు కొట్టుకుపోయింది. రేపు శ్రీశైలం గేటు కొట్టుకుపొతే ? ఇలాగే వీళ్ళ అసమర్ధత, నిర్ల్యక్షం కొనసాగితే, ఏదో ఒక రోజు కర్నూల్, విజయవాడ కొట్టుకుపోతాయి అనటంలో అతిశయోక్తి లేదు.