• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అలా చేసే దమ్ముందా ఈటల? హరీశ్ రావు బస్తీ మే సవాల్

బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం...మోడీ ఫొటో పెట్టి ప్రచారం చేయగలరా?: హరీశ్ రావు

admin by admin
August 6, 2021
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
112
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయ వేడి రాజేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్ గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా….అధికార టీఆర్ఎస్ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఇక, హుజురాబాద్ లో విజయం సాధించి తనను టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం సరైన నిర్ణయమేనని ప్రూవ్ చేసుకోవాలని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గట్ట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే అక్కడ పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నేపథ్యంలో నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌పై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌ లో దళితుల ఓట్లను చీల్చేందుకు బిజేపీ, కాంగ్రెస్‌లు చీకటి ఒప్పందం చేసుకున్నాయని హరీశ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీపై దేశంలో వ్యతిరేకత పెరిగిపోయిందని, మోడీ ఫోటో చూడగానే పెరిగిన డీజిల్‌, పెట్రోల్‌ , గ్యాస్‌ సిలిండర్‌ ధరలు గుర్తుకు వస్తాయని హరీశ్ ఎద్దేవా చేశారు. మోడీ ఫొటో చూసి జనం ఓట్లు వేయరన్న ఉద్దేశంతోనే ఈటల రాజేందర్‌ కొత్త తరహా ప్రచారానికి తెరతీశారని ఆరోపించారు.

ప్రధాని మోడీ ఫోటో, బీజేపీ జెండాలను దాచిపెట్టిన ఈటల…కేవలం తన ఫోటో, తన గుర్తును మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారని సెటైర్లు వేశారు. బీజేపీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని, మోడీ దగ్గర 1000 కోట్ల ప్యాకేజీని ఈటల తేగలరా అని హరీశ్ సవాల్ విసిరారు. ఈటల ఎత్తుగడలకు హుజూరాబాద్‌ ప్రజలు మోసపోరని దుయ్యబట్టారు. ఈటల గెలిస్తే ఆయనకు మాత్రమే లాభమని, టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే హుజూరాబాద్‌ ప్రజలందరికీ ప్రయోజనమని చెప్పారు.

ఇప్పటికే పెట్రోల్‌ ధర రూ.100 దాటిందని, బీజేపీకి ఓటేస్తే ఏడాది తిరిగే సరికి డీజిల్‌, పెట్రోల్‌ ధరలు రూ.200 దాటుతుందని, గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1500 దాటుతుందని హరీశ్ జోస్యం చెప్పారు. మోడీ దయవల్ల భారత ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్‌ కంటే అధ్వాన్నంగా మారిందని ఎద్దేవా చేశారు.
అందుకే పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీని బండకేసి బాదారని, రేపు హుజూరాబాద్‌లో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందని హరీశ్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. మరి, హరీశ్ రావు వ్యాఖ్యలపై ఈటల ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: ex minister eetelaharish rao challenges eetelaharish rao shocking commentshuzurabad bypollminister harish raopm modi
Previous Post

పులిచింతల ప్రాజెక్ట్ లో, 16వ నంబర్ గేటు కొట్టుకుపోయింది

Next Post

అమ్మాయిల కంటతడి…ఓదార్చిన మోడీ

Related Posts

Top Stories

రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి

August 20, 2022
Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Trending

జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

August 19, 2022
gorantla madhav
Top Stories

రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్

August 19, 2022
Trending

గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు

August 19, 2022
Movies

ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ

August 19, 2022
Load More
Next Post

అమ్మాయిల కంటతడి...ఓదార్చిన మోడీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి
  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్
  • ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra