మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై` అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది.
ఇదిలా ఉంటే.. ప్రియాంక చోప్రా తన ఫేవరెట్ కార్లలో ఒకటైన రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారును భారీ ధరకు అమ్మేసిందంటూ ఓ వార్త తాజాగా బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారును ఇప్పుడు అమ్మేయడం వెనక కారణం లేకపోలేదు. అమెరికాకు చెందిన పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంక 2018 డిసెంబర్లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడు అయిన నిక్‌ను ప్రియాంక్ పెళ్లి చేసుకోవడంపై అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అవేమి పట్టించుకోకుండా ఈ గ్లోబర్ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే నిక్ జోనస్‌ను పెళ్ళి చేసుకున్న తరువాత ప్రియాంక అమెరికాలోనే సెటిలైపోయింది. అక్కడే సొంత ఇల్లు కూడా కట్టేసుకున్నారీ జంట.
దీంతో ముంబైలో తన ప్రియమైన రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారు చాలా కాలంగా గ్యారేజ్‌లోనే ఖాళీగా ఉంటోందట. అందుకే బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తకు ప్రియాంక తన కారును మంచి రేటుకు అమ్మేసినట్లు తెలుస్తోంది. కాగా, బాలీవుడ్ లో ఈ రోల్స్ రాయ్స్ ఘోస్ట్ కారు కొన్న తొలి నటి ప్రియాంక చోప్రానే. ఇక ఈ కారు ధర ఎంతో తెలుసా.. అక్షరాలా రెండున్నర కోట్లు.