సంచలన వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ కమ్ హాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా. సుదీర్ఘకాలం బాలీవుడ్ లో పెద్ద ఎత్తున చిత్రాలు చేసిన ఆమె ఆ తర్వాత హాలీవుడ్ కు షిఫ్టు కావటం.. పలు హాలీవుడ్ మూవీస్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడే మనసుకు నచ్చిన ప్రముఖ పాప్ సింగర్నిక్ జోనాస్ ను పెళ్లాడి.. ఎంజాయ్ చేస్తున్న పియాంక తాజాగా పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకూ ఏం జరిగిందంటే.. పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ప్రియాంక.. ‘హిందీ సినిమా ఇండస్ట్రీలో నన్ను ఒక పక్కకు తోసేశారు. ఎవరూ అవకాశాలు ఇచ్చే వారుకాదు. పలువురితో విభేదాలు చోటు చేసుకున్నాయి. అక్కడి రాజకీయాలకు విసిగిపోయా. దీంతో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నా’’అంటూ ఇన్నాళ్లు మనసులో ఉన్న నిజాన్ని తాజాగా బయటపెట్టేశారు.
బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకొని అమెరికాకు వచ్చిన తర్వాత.. అంజులా ఆచార్య తన మ్యూజిక్ వీడియోను మెచ్చి.. హాలీవుడ్ లో పని చేసే అవకాశం కల్పించారని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకొని హాలీవుడ్ కు వచ్చిన వేళలో.. ప్రియాంకకు తొలి బ్రేక్ ఇచ్చిన ఆమెనే ప్రియాంక తన మేనేజర్ గాఎంపిక చేసుకోవటం గమనార్హం. ఆమె ఇచ్చిన మ్యూజిక్ వీడియోను మెచ్చి హాలీవుడ్ లో అవకాశాలు వచ్చినట్లుగా పేర్కొన్నారు. లక్కీగా బాలీవుడ్ ను వదిలేసి.. హాలీవుడ్ లో అడుగు పెట్టినట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి మనసులో దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా ఓపెన్ కావటం ఇప్పుడు ప్రియాంక గురించి మాట్లాడుకోవటం గమనార్హం.