కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి, ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `డార్లింగ్`. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ అశ్విన్ రామ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్స్ ద్వారానే మంచి అంచనాలను ఏర్పర్చుకున్న డార్లింగ్ మూవీ జూలై 19న విడుదలైంది.
అయితే ప్రేక్షకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కామెడీ వర్కోట్ అయినప్పటికీ.. అనుకున్న కాన్సెప్ట్ ను ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ బాగా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఆడియెన్స్‌ను గందరగోళానికి గురిచేశాడు. అందువల్ల డార్లింగ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు గత వారం రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
రెయిన్ ఎఫెక్ట్ కూడా డార్లింగ్ మూవీపై గట్టిగానే పడింది. విడుదలకు ముందు రూ. 5.2 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా.. రూ. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో డార్లింగ్ బరిలోకి దిగింది. అయితే నాలుగు రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1.18 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ను వసూల్ చేసింది. టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఇంకా రూ. 4.32 కోట్లు షేర్ రావాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్ ను ప్రియదర్శి ఏ మేరకు రీచ్ అవుతాడో చూడాలి.