అజయ్ దేవ్గణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇండో పాక్ బోర్డర్ లో ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 13న హాట్స్టార్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సిజ్లింగ్ గర్ల్, ఐటం బాంబ్ నోరా ఫతేహి కూడా ఓ కీలక పాత్రలో నటించింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నోరా ఫతేహి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ టైమ్లో నుదుటిపై గాయమై రక్తమోడుతున్నా…షూటింగ్ లో పాల్గొన్నానని నోరా చెప్పింది. సన్నివేశాలు సహజంగా రావడం కోసం తన బాధని భరిస్తూ షూటింగ్లో పాల్గొన్నానని చెప్పింది. షూటింగ్లో ఓ నటుడు మెటల్ గన్ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి బలంగా తగలడంతో నుదుటిపై రక్తం కారిందని చెప్పింది.
అయితే, దెబ్బ తగిలినప్పటికీ అలాగే నటించడంతో ఆ సీన్ చాలా సహజంగా వచ్చిందని చెప్పింది. అంతేకాదు, ఆ తర్వాతి రోజు మరో యాక్షన్ సీన్లోనూ కాలికి గాయమైందని, అయినప్పటికీ ఈ దెబ్బల తాలూకు మచ్చలతోనే అన్ని సీన్లలో నటించానని చెప్పుకొచ్చింది. ఇక, డూప్ లేకుండా గాయాలతోనే యాక్షన్ సన్నివేశాలు షూట్ చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటూ చెప్పిందీ హాట్ బ్యూటీ.