ఏపీలో ఒక వింత చోటుచేసుకుంది.
సాధారణంగా గవర్నమెంటు పనులు పైరవీలు చేసి, లంచాలు ఇచ్చి మరీ అడుగుతారు.
కానీ ఏపీలో జగన్ సర్కారు బతిమాలుతున్నా ఎవరూ పనులు చేయడానికి ముందుకు రావడం లేదట.
రోడ్లు వేయడానికి టెండర్లు పిలిస్తే ఏపీలో వైసీపీ ప్రొ కాంట్రాక్టర్లతో సహా ఎవరూ టెండర్లు వేయలేదు.
ఎందుకిలా జరిగింది
ఏపీలో దేవుడి భూములు తాకట్టు పెట్టి పేదలకు డబ్బులు పంచుతారు
ఏపీలో ప్రభుత్వ భూములు అమ్మి పేదలకు డబ్బులు పంచుతారు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు ఆపి పేదలకు డబ్బులు పంచుతారు
ఏపీలో అభివృద్ధి పనులు ఆపి పేదలకు డబ్బులు పంచుతారు
ఏపీలో రాజధాని నిర్మాణం ఆపి పేదలకు డబ్బులు పంచుతారు
ఏపీలో పెట్రోలు, కరెంటు ధరలు పెంచి పేదలకు డబ్బులు పంచుతారు
ఏపీలో దేవుడి భూములు అమ్మి పేదలకు డబ్బులు పంచుతారు
ఏపీలో ఉద్యోగాలు సృష్టించి, ట్యాక్సులు కట్టే కంపెనీలకు ఇయ్యాల్సిన భూములును పేదలకు పంచుతారు
అంతా ఓకే….
మరి మేము మా డబ్బులు పెట్టి రోడ్లు వేస్తే రేపు మాకివ్వాల్సిన డబ్బులు తీసుకెళ్లి పేదలకు పంచరని గ్యారంటీ ఏమిటి… మేము ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుతాం లేదంటే వేరే స్టేటులో కాంట్రాక్టులు చేస్తాం కానీ ఏపీలో కాంట్రాక్టులకు టెండర్లు వేయం మమ్మల్ని వదిలెయ్ సామీ అంటున్నారట కాంట్రాక్టర్లు.
ఏపీయా మజాకా?