జగన్ హయాంలో ఏపీలో క్రిష్టియానిటీ పెరుగుతోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో తన బావ బ్రదర్ అనిల్ కుమార్ సాయంతో జగన్ మతమార్పిళ్లు చేయిస్తున్నారని ఆయన షాకింగ్ కామెంట్లు చేయడం గతంలో చర్చనీయాంశమైంది. మతమార్పిళ్ల ద్వారా రాష్ట్రంలో క్రైస్తవ ఓటు బ్యాంకును జగన్ పెంచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
జగన్ హయాంలో ఏపీలో బ్రిటీష్ వారిని మించిన క్రైస్తవ పాలన కొనసాగుతోందని, చాపకింద నీరులా హిందూ మతాన్ని నాశనం చేసేందుకు జగన్ కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జగన్ సర్కార్ పై శ్రీనివాసానంద సరస్వతి షాకింగ్ కామెంట్లు చేశారు. ఏపీలో హిందువులను అణచివేసేందుకు ప్రభుత్వం ఒక రహస్య అజెండాతో ముందుకు సాగుతోందని ఆరోపించారు.
హిందూ సమాజాన్ని జగన్ సర్కార్ దారుణంగా అవమానిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. రామతీర్థం కోదండ రామాలయంలో ఘటన జరిగి ఏడాది పూర్తయినా నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు. హిందువులపై వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని అన్నారు. వైఎస్సార్సీపీ అంటే వైఎస్సార్ క్రిస్టియన్ పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. పోలీస్ వ్యవస్థను సైతం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీకి స్వామి శ్రీనివాసానంద చెప్పిన కొత్త నిర్వచనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.