నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట లో నారా లోకేష్ పర్యటన
కాసేపట్లో హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకోనున్న నారా లోకేష్.
గన్నవరం నుండి రోడ్డు మార్గం ద్వారా నరసరావుపేట చేరుకోనున్న నారా లోకేష్
నరసరావుపేటలో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శి0చనున్న లోకేష్.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న నారా లోకేష్
లోకేష్ పర్యటన కు అనుమతి నిరాకరించిన గుంటూరు జిల్లా పోలీసులు.
నారా లోకేష్ నరసరావుపేట పర్యటన కు అనుమతి లేదు అని స్పష్టం చేసిన పోలీసులు.
కోవిడ్ నేపద్యంలో నారా లోకేష్ పర్యటన కు అనుమతి లేదు అంటున్న జిల్లా పోలీసులు.
ఖచ్చితంగా నరసరావుపేట వచ్చి తీరుతా అంటున్న నారా లోకేష్,టీడీపీ నేతలు.
కోవిడ్ దృష్ట్యా లోకేశ్ పర్యటనకు అనుమతి లేదంటున్న పోలీసులు – గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు – విమానాశ్రయంలోకి ఎవరినీ అనుమతించని పోలీసులు – నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో వందమంది పోలీసు బలగాలు – విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన భద్రత – విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు.
ఎయిర్ పోర్ట్ బయట ఆపేస్తున్న పోలీసులు.
మరోవైపు ఎయిర్ పోర్ట్ వద్దకు చేరుకుంటున్న టీడీపీ నేతలు,కార్యకర్తలు.
సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తున్న కుటుంబ సభ్యులను బయట ఆపేస్తున్న పోలీసులు.
పోలీసుల తీరు పట్ల కుటింబికులు ఆగ్రహం.
లోకేష్ చేసేది దొంగ ఓదార్పు యాత్రలు కాదు. మీ చేతగాని పాలనకు బలైన తెలుగింటి ఆడపడుచుల కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు – ధూళిపాళ్ళ
తండ్రి చనిపోయిన తరువాత 3 సంవత్సరాల వరకు ఆ మరణంతో సంబంధంలేని వారిని ఓదార్పు యాత్ర పేరుతో పర్యటనలు చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వారేనా లోకేష్ పర్యటనను ప్రశ్నించేది?
ఈ మధ్యకాలంలో ఒక ఉన్మాది చేతిలో అసువులు బాసిన అబల కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ రావడాన్ని పెద్దతప్పుగా చూపడం సరైనదేనా?
బాధ్యత గల ఉన్నత స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి తెలియదా ప్రజాస్వామ్యం గురించి?
అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే లోకేష్ పై ప్రజా సేవకుని స్థానంలో ఉండి ఆరోపణలు చేయడం ఏరకంగా సమంజసం?
YSR వర్థంతికి లేని కరోనా నిబంధనలు పేద కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాయా?
గుంటూరుసిటీ పరిధిలో పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసే ధైర్యం ఒక కుర్రవాడికి వచ్చిందంటే అది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా?
రమ్య హత్య కేసును రాజకీయం చేయాలని చూసింది మీరు కాదా?
దీనిని బట్టే తెలుస్తుంది మీరు లా&ఆర్డర్ ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారో?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు అన్యాయాన్ని ప్రశ్నించే హక్క లేదా?
మనం ఉన్నది ప్రజాస్వామ్య పాలనలోనా? రాజరిక పాలనలోనా?
శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్న నారా లోకేష్.. అక్కడ నుంచి గన్నవరం రానున్న లోకేష్ – నారా లోకేష్ వెంట వంగలవుడి అనిత, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు