ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఎమ్మెల్సీ కవిత అరెస్టు కూడా తప్పదని టాక్ వస్తోంది. 6 నెలల హైడ్రామా తర్వాత సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. బలమైన సాక్ష్యాధారాలు దొరికిన తర్వాతే సిసోడియాని అరెస్ట్ చేసింది సీబీఐ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన దగ్గర ఒక్క మంత్రిత్వ శాఖను కూడా ఉంచుకోలేదు. ఇలా ఏ శాఖా లేకుండా ఉన్న సీఎం కేజ్రీవాల్ ఒక్కరే. ఎందుకంటే, అవినీతి ఆరోపణలు వస్తే తనకు మరకలు అంటకుండా కేజ్రీ జాగ్రత్తపడ్డారు.
తనకు నమ్మినబంట్లయిన సత్యేంద్ర కుమార్ జైన్, మనీష్ సీసీడియాలకు ఎక్కువ శాఖలు అప్పచెప్పి పరోక్షంగా వాటిని తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడు కేజ్రీవాల్. సత్యేంద్ర కుమార్ జైన్ మనీ లాండరింగ్ కేసులో 9 నెలల క్రితం అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఇక, తాజాగా మనీష్ సిసోడియా కూడా అరెస్టయ్యారు. దీంతో, వీరిద్దరూ చచ్చినట్లు రాజీనామా చేయాల్సి వచ్చింది.
కేజ్రీవాల్ కు కూడా ఈ స్కాముల్లో పాత్ర ఉన్నా…డబ్బు ముట్టినా చాలా తెలివిగా తప్పించుకుంటూ తన అనుచరను జైలు పాలు చేస్తున్నాడు. దీంతో, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ లు సీబీఐకి బలమైన సాక్ష్యాధారాలు ఇవ్వడంతో మనీష్, కేజ్రీవాల్ లు దొరికిపోయారు. ఇక, ఈ లిక్కర్ స్కామ్ లో బలంగా పేర్లు వినిపిస్తున్న సౌత్ గ్రూప్ లో వైసీపీ ఎంపీ మాగుంట, ఆయన తనయుడు రాఘవ, సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవితలకు కూడా తిప్పలు తప్పవట.
కవితతో పాటు ఈ స్కామ్ లో ఉన్నవారంతా వారానికోసారి ఫోన్లు తగులబెట్టి కొత్త ఫోన్లు, సిమ్ లు కొనాలి. కానీ, విజయ్ నాయర్,సమీర్ మహేంద్రు,అమిత్ ఆరోరాలు మాత్రం తమ ఫోన్లను తగులబెట్టకుండా కొత్త సిమ్, ఫోన్ లు వాడారు. చివరకు అప్రువర్లుగా మారి పాత ఫోన్లను సిబిఐ కి ఇచ్చేయడంతో సిసోడియాకు ఉచ్చు బిగుసుకుంది. అందుకే, రేపో మాపో కవితను కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.