వైకాపా తన తోకకు తానే నిప్పటించుకుంది.
నవరత్నాలు ఇస్తే జనం ఏం చేసినా మాకే ఓటేస్తారన్న వైసీపీ కలలు కరిగిపోతున్నాయి.
30 ఏళ్ల సీఎంగా ఉంటాను అని ప్రకటించిన వ్యక్తి 3 ఏళ్లు నిండకుండానే పాలన చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు.
కనీస అవసరాలు అయిన జీతాలు, కరెంటు, రోడ్లు, రేషను కూడా సమయానికి ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు జగన్
దేశంలో ఎక్కడా లేనట్లు ఏపీలో కరెంటు కోతలు ఉన్నాయి. 2019కి ముందు కరెంటు సర్ ప్లస్ లో ఉన్న ఆంధ్రలో ఈ కోతలు ఎలా వచ్చాయో పీపీఏలపై జగన్ చేసిన నిర్ణయాలకు సంబంధించిన వార్తలు గూగుల్ లో వెతికితే దొరుకుతాయి.
అధిక ధరలు, అధ్వాన్న రోడ్లు, అరాచక నేతలు వెరసి వైసీపీ వద్దుబాబోయ్ అని వైసీపీ నేతలే పార్టీ వీడుతున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ పార్టీలో చేరారు. ఈ వీడియోలో చూడొచ్చు.
https://www.youtube.com/watch?v=neIH8z9M07Q&ab_channel=AJSTV