పేరుకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి జరిగిన ఎన్నికలే కానీ.. అందరి చూపు పశ్చిమబెంగాల్ మీదనే. ఎందుకంటే.. దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రధాని పర్సనల్ గా తీసుకున్న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఏ రీతిలో ఉంటుందన్న విషయంపై నెలకొన్న ఉత్కంట అంతా ఇంతా కాదు.
ఇటీవల కాలంలోఎప్పుడూ లేనట్లుగా ఒక బలమైన.. ప్రజాకర్షక ప్రధాని వర్సెస్ పాపులర్ అధినేతగా పేరున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్య జరిగిన పోరులో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరం కాక మరేం ఉంటుంది.
ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి డబుల్ సెంచురీతో తిరుగులేని మెజార్టీని ప్రదర్శించిన మమత.. తాను సొంతంగా పోటీ చేసిన నందిగ్రామ్ లో ఫలితం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.
తనకు ఏ మాత్రం బలం లేని చోట.. అప్పటివరకు తనకు రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తి.. తనను కాదని బీజేపీలోకి వెళ్లిపోయిన సువేందుకు మీద పోటీ కావటం.. ఏ మాత్రం తేడా కొట్టినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే.. ఈ రిస్కును తీసుకున్న మమత.. తాను అనుకున్నది సాధించగలిగారు.
పార్టీ పరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న విషయం ఓట్ల లెక్కింపు మొదలైన రెండు గంటలకే తేలిపోయినా.. ముఖ్యమంత్రిగా ఉన్న మమత సొంతంగా బరిలోకి దిగిన నందిగ్రామ్ లో ఆమె వెనుకబడి ఉండటం పలువురికి షాకిచ్చింది.
దీంతో.. విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుందన్న అంచనాల వేళ.. వెనుకంజ నుంచి ముందంజలోకి రావటంతో కాదు.. స్వల్ప అధిక్యతలోకి వచ్చారు. తాజాగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం పూర్తి అయ్యింది. తీవ్ర ఉత్కంట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కమ్ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ పోరులో మమత గెలుపొందగా.. మెజార్టీ మాత్రంతక్కువగా వచ్చిందని చెప్పాలి. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై ఆమె 3700 ఓట్ల అధిక్యతతో విజయం సాధించారు.
గతంలో ఎన్ని విజయాలు సాధించినా.. మమతకు మాత్రం ఈ విజయం అపూర్వమైనదే కాదు. తన రాజకీయ జీవితంలో ఎప్పటికి మర్చిపోలేని గెలుపుగా చెప్పక తప్పదు.