ప్రజాచైతన్యంలో విజయవంతమైన తొలి మజిలీ
ప్రజలకష్టాల్లో మమేకమవుతూ ముందుకుసాగిన యువనేత
34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1269 కి.మీ. సాగిన యువగళం
రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువనేత నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. 400రోజుల్లో 4వేల కిలోమీటర్లకు చేరుకోవాలని పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ వడివడిగా అడుగులువేస్తూ, ప్రజల కష్టాల్లో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనను క్షేత్రస్థాయిలో ఎండగట్టి, ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం తొలిమజిలీ విజయం సాధించింది.
జనవరి 27వతేదీన కుప్పంలో ప్రారంభమైన యాత్ర ఇప్పటివరకు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1269 కి.మీ. మేర యువగళం పాదయాత్ర కొనసాగింది. వందరోజుల సుదీర్ఘ పాదయాత్రలో 32 బహిరంగసభలు, వివిధవర్గాలతో 87 ముఖాముఖి కార్యక్రమాలు, హలో లోకేష్ పేరిట 4 ప్రత్యేక కార్యక్రమాల్లో యువనేత ప్రసంగించారు. రోజురోజుకు యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందన అధికారపార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దారిడిపొడవునా జనం యువనేతకు నీరాజనాలు పడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు.
వైసిపి సైకోమూకలు ఒకవైపు, జగన్ రెడ్డి తొత్తులుగా మారిన పోలీసులు మరోవైపు అడుగడుగునా ఆటంకాలు సృష్టించినా లోకేష్ ఉక్కుసంకల్పం ముందు దిగదుడుపే అయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45రోజులు, ఉమ్మడి అనంతపురంలో 9 నియోజకవర్గాల్లో 23 రోజులు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 11నియోజకవర్గాల్లో 32 రోజులు యువగళం పాదయాత్ర కొనసాగింది. 100రోజుల పాదయాత్రలో రాతపూర్వకంగా యువనేతకు 1900 వినతిపత్రాలు అందగా, దారిపొడవునా వేలాది ప్రజలు లోకేష్ ను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. పాదయాత్ర చిత్తూరు జిల్లాలో పూర్తికాకముందే రాష్ట్రవ్యాప్తంగా 9జిల్లాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీవ్ చేయడంద్వారా యువగళం సత్తాచాటారు. పాదయాత్రలో వైసిపి ఎమ్మెల్యేల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతూ అధికారపార్టీ పెద్దలకు సింహస్వప్నంగా మారారు యువనేత లోకేష్.
విరామం లేని యువగళం
యువగళం పాదయాత్ర విరామం లేకుండా ముందుకు సాగుతోంది. 100 రోజుల ప్రయాణంలో యువనేత కేవలం మూడు సార్లు అనివార్య పరిస్థితుల్లో మాత్రమే సెలవులు తీసుకోవాల్సి వచ్చింది. 1. తారకరత్న మరణం 2. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ 3.ఉగాది సందర్భంలో మాత్రమే లోకేష్ పాదయాత్రకు విరామం ఇచ్చారు. గతంలో జగన్ శుక్రవారం వీక్లీ ఆఫ్ పాదయాత్రను చూసిన ప్రజలు… నేడు విరామం లేని లోకేష్ పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా లెక్కచేయకుండా కష్టాల్లో ఉన్న ప్రజల చెంతకు చేరేందుకు యువనేత ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. శని, ఆదివారాల్లో కూడా లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అందరి సమస్యలను ఓపిగ్గా వింటూ మండుటెండలు, హోరువర్షంలో సైతం యువనేత ఎటువంటి బ్రేక్ లేకుండా పాదయాత్ర కొనసాగిస్తుండటం పార్టీ కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపుతోంది.
సెల్ఫీ ఛాలెంజ్ తో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరి!
యువగళం పాదయాత్ర దారిలో టిడిపి హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల తాలుకూ విజయగాథలు, వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ లు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెనుగొండ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో పాలసముద్రం కియా ఫ్యాక్టరీ వద్ద యువనేత విసిరిన సెల్ఫీ చాలెంజ్ ఇప్పటివరకు యాత్రలో హైలైట్ గా నిలచింది. కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు..థిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. చంద్రబాబు దునియా మొత్తం చూసేశారు. ఆ దూరదృష్టి నుంచి వచ్చే ఆలోచనలను ఆచరణలో పెడతారు కాబట్టే ఆయనని దార్శనికుడు అని అంటారు. చంద్రబాబు ఎన్నో ప్రయసలకోర్చి కియాని తీసుకొచ్చినప్పుడు, కమీషన్ల కోసం తెచ్చారని అన్నారు. ఈరోజు కరువుసీమలో వేలమంది యువతకు కియా ఉపాధి చూపిందంటూ చేసిన వ్యాఖ్యలు యువతను కదిలించాయి. టిసిఎల్, జోహో, డిక్సన్ వంటి కంపెనీల వద్ద లోకేష్ విసిరిన సెల్ఫీ చాలెంజ్ లు యువతను ఆకట్టుకున్నాయి. డిక్సన్ కంపెనీ ఉద్యోగుల బస్సు ఎక్కి లోకేష్ సెల్ఫీ దిగుతూ మిస్టర్ జగన్ రెడ్డీ… నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీరు..నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చానని చెప్పుకోగలవా!?, ఒక్క ఉద్యోగమైనా ఇప్పించగలిగానని ప్రకటించగలవా” అంటూ సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
సెల్ఫీ విత్ లోకేష్ తో కార్యకర్తల్లో జోష్
ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు యువనేత లోకేష్ 1.40లక్షలమంది అభిమానులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమం కారణంగా ఒకానొక సమయంలో తీవ్రమైన రెక్కనొప్పి వచ్చింది. ఈ సమయంలో సెల్ఫీలు వద్దని వ్యక్తిగత వైద్యులు వారించిన యువనేత వినలేదు. అభిమానులను నిరాశపర్చకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. యువనేతతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్ చేయించి, ఫేస్ రికగ్నషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంతోపాటు దారిపొడవునా తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్కరినీ కాదనకుండా ఓపికగా ఫోటోలు దిగుతున్నారు.
ముఖాముఖి సమావేశాలతో సమస్యలపై అధ్యయనం
పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలపై యువనేత లోకేష్ లోతైన అధ్యయనం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయావర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక తాము ఏం చేయబోతున్నారో స్పష్టం చేస్తున్నారు. రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటి ప్రొఫెషనల్స్ తదితర వర్గాలతో యువనేత సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో వివిధ కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విషయాన్ని గమనించిన లోకేష్… అధికారంలోకి వచ్చిన వెంటనే వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలతో జాబ్ నోటిఫికేషన్, ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, పరిశ్రమల ఏర్పాటుద్వారా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీలతో యువతకు భరోసా ఇస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్లు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మొబైల్ ఫోన్లకే శాశ్వత కులధృవీకరణ పత్రాలు పంపిస్తామని హామీ ఇచ్చారు. బిసిల రక్షణకు ఎస్సీ, ఎస్టీ తరహా చట్టం, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు, చేనేతలు, రజక వృత్తి పనివారికి ఉచిత విద్యుత్ వంటి హామీలు ఆయా వర్గాలు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి.
ఆకట్టుకుంటున్న హలో లోకేష్!
పాదయాత్ర నిర్వహించేటప్పుడు ప్రతిజిల్లాలో ఒకచోట నిర్వహించే హలో లోకేష్ కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తిరుపతిలో ఫిబ్రవరి 2న యువతతో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున యువతీయువకులు తరలివచ్చారు. యువత భవిష్యత్ కోసమే తాను యువగళం ప్రారంభించినట్లు చెప్పారు. యువత విషయంలో తెలుగుదేశం పార్టీ విధానాన్ని యువనేత వ్యక్తీకరించారు. ఏప్రిల్ 8న అనంతపురం జిల్లా శింగనమలలో నిర్వహించిన రైతన్నతో లోకేష్ కార్యక్రమానికి భారీఎత్తున రైతులు తరలివచ్చి తమ అభిప్రాయాలను యువనేతకు తెలియజేశారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని పూర్తిచేసి, గోదావరి మిగులుజలాలను రాయలసీమకు తెస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. రైతులమోములో ఆనందం చూసినపుడే తన యాత్ర విజయవంతమైనట్లు అని లోకేష్ తెలిపారు. ఏప్రిల్ 24న పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ వద్ద పల్లెప్రగతి కోసం మీ లోకేష్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీరహితంగా సర్పంచులు తరలివచ్చారు. టిడిపి అధికారంలోకి రాగానే పంచాయితీలకు నిధులు, విధులు కల్పిస్తామని, వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో గ్రామాల్లో 24/7 సురక్షితమైన తాగునీరు అందిస్తామని, సర్పంచ్ లకు గౌరవవేతనంతోపాటు గౌరవం పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయ వ్యవస్థను పంచాయితీలకు అనుసంధానిస్తామని తెలిపారు. మే 7వతేదీన కర్నూలులో ముస్లిం మైనారిటీలతో నిర్వహించిన లోకేష్ తో గుఫ్తగు కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం సోదరులు తరలివచ్చి వైసిపి ప్రభుత్వం వచ్చాక తాము పడుతున్న కష్టాలు చెప్పుకున్నారు. జగన్ ప్రభుత్వ అసమర్థత వల్లే మైనారిటీలపై దాడులు పెరిగాయని, టిడిపి అధికారంలోకి వచ్చాక ముస్లింలకు రక్షణ కల్పిస్తామని యువనేత భరోసా ఇచ్చారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామని, మైనారిటీల ఆస్తుల పరిరక్షణకు వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తామని చెప్పారు.
యువగళం గొంతునొక్కేందుకు విఫలయత్నాలు!
యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. యువనేత లోకేష్ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తనగళంగా వినిపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లనియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25పోలీసు కేసులు నమోదయ్యాయి. సగటున రెండురోజులకు ఒక కేసు చొప్పున బనాయించారంటే యువగళం గొంతునొక్కేందుకు ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో యువనేత లోకేష్ పై 3కేసులు నమోదు చేశారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. చివరకు వైసిపి పెద్దలు ఏస్థాయికి దిగజారారంటే పీలేరులో బాణాసంచా కాల్చారని కూడా అక్కడి ఇన్ చార్జి నల్లారికిషోర్ కుమార్ రెడ్డి, మరికొందరిపై పోలీసులు 3కేసులు నమోదు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనకు ఇది పరాకాష్ట. యువనేత లోకేష్ తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కుప్పం పీఎస్ మనోహర్, పలమనేరు ఇన్ చార్జి అమర్ నాథ్ రెడ్డి, చంద్రగిరి ఇన్ చార్జి పులివర్తి నాని, పీలేరు ఇన్ చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతో సహా పలువురు టిడిపి నేతలపై పోలీసులు తప్పుడు కేసులు నమోదుచేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా క్రమశిక్షణకు మారుపేరైనా లోకేష్ నేతృత్వంలో యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. పాదయాత్ర దారిలో పత్తికొండ, కర్నూలు వంటి ప్రాంతాల్లో వైసిపి పేటిఎం బ్యాచ్ యువనేతను అడ్డుకునేందుకు నల్లజెండాలతో విఫలయత్నం చేయగా, లోకేష్ దీటుగా సమాధానమిచ్చి తిప్పికొట్టారు.
పదునైన ప్రసంగాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు
యువనేత లోకేష్ తాను పాదయాత్ర నిర్వహించే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకచోట బహిరంగసభ నిర్వహిస్తూ వాడి,వేడి వాగ్భాణాలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తుండటంతో అధికారపార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏంచేస్తామని స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. చిత్తూరు జిల్లా పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎత్తిచూపుతూ పాపాల పెద్దిరెడ్డీ… అంటూ సింహగర్జన చేశారు. చిత్తూరు జిల్లాకు ఎవరేంచేశారో చర్చకు రావాలంటూ యువనేత విసిరిన సవాల్ కు ఉక్కిరిబిక్కిరైన మిథున్ రెడ్డి… చివరకు ఎన్నికల కోడ్ నెపంతో లోకేష్ ను జిల్లానుంచి పంపించేశారంటే ఎంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అనంతపురం జిల్లాలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలను వీడియో ఆధారాలతో సహా ఎండగట్టి సంచలనం సృష్టించారు. కర్నూలు జిల్లాలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అవినీతిని తూర్పారబట్టారు. తమబండారాన్ని బట్టబయలు చేస్తున్నాడన్న అక్కసుతో పలుచోట్ల ఎమ్మెల్యేలు బూతులతో ఎదురుదాడికి దిగుతుండగా, డాక్యుమెంట్లు, ఆధారాలతో లోకేష్ వారిని నిలదీస్తూ ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టడం సంచలనం సృష్టిస్తోంది.
పాదయాత్రలో ఇన్ స్టంట్ గా సాయం!
పాదయాత్ర సందర్భంగా తమ కష్టాలు చెప్పుకున్న పలువురికి ఇన్ స్టంట్ గా సాయం అందిస్తున్నారు. తీవ్రమైన సమస్యల కారణంగా జీవితంలో దెబ్బతిన్న వారికి లోకేష్ ఆర్థికసాయం అందించడం లోకేష్ లోని మానవీయ కోణానికి అద్దం పడుతున్నాయి. ఏప్రిల్ 2న ధర్మవరంలో చేనేతలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత వర్గానికి చెందిన రాములమ్మ అనే మహిళ అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీరుమున్నీరైంది. దీంతో చలించిన లోకేష్..ఆమె ఇద్దరి బిడ్డల చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చి, ఎన్టీఆర్ ట్రస్ట్ కు రిఫర్ చేశారు.
ఏప్రిల్ 28న కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో దళిత మహిళా రైతు రంగమ్మ తన బాధను వెళ్లబోసుకుంది. 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేయడం వల్ల రూ.30 లక్షల అప్పవ్వడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పగానే..రంగమ్మకు రూ.1 లక్ష సాయాన్ని నారా లోకేష్ ప్రకటించారు. ఆ సాయాన్ని ఎమ్మిగనూరులో 30వ తేదీన రంగమ్మకు అందించారు. అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యువనేత పాదయాత్ర సందర్భంగా రజకమహిళ మునిరాజమ్మ యువనేతకు తన కష్టాలు చెప్పుకున్నారు. దీన్ని ఓర్చుకోలేని వైసిపినేతలు ఫిబ్రవరి 27న ఆమె టిఫిన్ కొట్టు ధ్వంసం చేసి..నడివీధిలో నా చీర వితప్పుతామన బెదిరించారు. లోకేష్ తో మాట్లాడినందుకు ఊరి వదిలి ఏడాదిపాటు బయటకు పొమ్మంటున్నారు. వైసీపీ కార్యాలయానికి వచ్చి క్షమాపణ చెప్పంటున్నారు. నేను చనిపోవడానికైనా సిద్ధమే..క్షమాపణ చెప్పనని మునిరాజమ్మ కరాఖండీగా చెప్పింది. తర్వాత లోకేష్ ను కలిసి వైసిపినేతల ఆగడాలని తెలియజేసింది. ఆమెకు ధైర్యం చెప్పిన లోకేష్, మునిరాజమ్మకు కొత్తషాపు ఏర్పాటుచేసుకోవడానికి ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆమె భర్తకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు.
మంత్రి రోజా లోకేష్ కు చీర,గాజులు ఇస్తానని చెప్పడంతో ఆటోలో టీడీపీ మహిళా నేతలు నగరిలోని ఆమె ఇంటికి చీరలు, గాజులు ఇవ్వడానికి వెళ్లారు. ఈ సందర్భంలో మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు, వారు వెళ్లిన ఆటోను కూడా పోలీసులతో రోజా సీజ్ చేయించారు. ఆటో కార్మికుడు హమీద్ బాషా ఆటోతోనే తాను జీవనం సాగిస్తున్నానని, దానిని పోలీసులు తీసుకెళ్లారని బాధపడ్డాడు. దీంతో లోకేష్ ఆయనకు ధైర్యం చెప్పి, ఫిబ్రవరి 24న కొత్తఆటో హమీద్ బాషాకు అందించారు.
వంద కిలోమీటర్లకు ఓవరం
యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత నారా లోకేష్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వందకిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ… తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో సంబంధిత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి చొప్పున 12 అభివృద్ధి కార్యక్రమాలకు యువనేత లోకేష్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక ఆయా ప్రాంతాల్లో సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, లేకపోతే ఆయా ప్రాంత ప్రజలు తనను నిలదీయవచ్చని చెప్పడం యువనేత లోకేష్ నిజాయితీకి అద్దంపడుతోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా
యువనేత పాదయాత్ర 8వరోజు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో 100కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.ఈ సందర్భంగా బంగారుపాళ్యంలో కిడ్నీవ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు శిలఫలకాన్ని ఆవిష్కరించారు. 16వరోజు జిడినెల్లూరు నియోజకవర్గం కత్తెరపల్లిలో 200 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో జిడి నెల్లూరులో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. 23వరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం తొండమానుపురం వద్ద యాత్ర 300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా అక్కడ 13 గ్రామాలకు తాగునీరందించే రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో చేపడతామని ప్రకటించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. యువగళం పాదయాత్ర 31వరోజు 400 కి.మీ చేరుకున్నసందర్భంగా పాకాల మండలం నరేంద్రకుంట మజిలీలో ఆధునిక వసతులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫలకం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నరేంద్రకుంటలో పీహెచ్ సీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 39వరోజు మదనపల్లి శివారు చినతిప్పసముద్రంలో పాదయాత్ర 500వరోజుకు చేరుకున్న సందర్భంగా మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్ స్టోరేజి ఏర్పాటుచేస్తామని ప్రకటించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా
47వరోజు కదిరి నియోజకవర్గం చిన్నయ్యగారిపల్లి వద్ద పాదయాత్ర 600 కి.మీ. చేరుకున్న సందర్భంగా ఆ ప్రాంతంలో టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. 55వరోజు పెనుగొండ నియోజకవర్గం గుట్టూరు వద్ద 700 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా గోరంట్ల, మడకశిర ప్రాంతాల తాగు,సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి హంద్రీనీవా కాల్వ నుంచి ఎత్తపోతల పథకం నిర్మిస్తామని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. యువగళం పాదయాత్ర 63వరోజు 800 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ కు యువనేత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఉమ్మడి కర్నూలుజిల్లా
యువగళం పాదయాత్ర 70వరోజు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో ఈరోజు 900 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ఆదోని సిరిగుప్ప క్రాస్ వద్ద 77వరోజు యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 1000 కి.మీ. మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్డులో త్రాగునీరు, డ్రైనేజ్, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగుడ్లలో 86వరోజు యువగళం పాదయాత్ర 1100 కి.మీ. మైలురాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 10వేలమందికి ఉపాధి కల్పించే టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుచేస్తామని హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జనగళమే యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర 105-2023న నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకుంది. ఈ సదర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి హామీ ఇచ్చి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
రాయలసీమలో ప్రధాన సమస్యలు – యువనేత హామీలు
రాయలసీమలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వలసల నివారణ.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
హంద్రీనీవా, గాలేరు-గాలేరు నగరి పూర్తిచేస్తాం.
తుంగభద్ర హెచ్ఎల్ సి, ఎల్ఎల్ సిల కాల్వ ఆధునీకరణ పూర్తి.
రూ.1986కోట్లతో ఆర్ డిఎస్ కుడికాల్వ పనులు పూర్తి.
వాటర్ గ్రిడ్ ఏర్పాటు, ఇంటింటికీ తాగునీటి కుళాయి.
తిరుపతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు.
90శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్.
మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు.
ఉరవకొండ నియోజకవర్గంలో మెగా డ్రిప్ ప్రాజెక్టు పూర్తి.
గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను పంచాయితీలతో అనుసంధానం.
పట్టు రైతులకు సిల్క్ సబ్సిడీ.
కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ.
ఆదోనిలో మిర్చియార్డు, కోల్డ్ స్టోరేజిల ఏర్పాటు.
వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరు అందిస్తాం.
కదిరి నియోజకవర్గం చినఎల్లంపల్లి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు.
శింగనమల నియోజకవర్గం మార్తాడు వద్ద చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు.
ఎమ్మిగనూరులో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు.
ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లి నియోజకర్గాలకు తాగునీరు అందించే గుండాల ప్రాజెక్టు నిర్మాణం.
రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సాగు, తాగు నీటిని అందించే జీడిపల్లి- భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపు పథకాన్ని పూర్తిచేస్తాం.
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలో ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నిర్మాణం.
వైకాపా భూబకాసురులు కబ్జా చేసిన లేపాక్షి భూములని స్వాధీనం చేసుకుని, ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు.
వివిధ వర్గాలకు లోకేష్ ఇచ్చిన హామీలు:
యువనేత లోకేష్ 100 రోజుల పాదయాత్ర వివిధ వర్గాలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక హామీలను అమలుచేసే బాధ్యత తమదని చెప్పారు.
యువతకు హామీలు
ఏటా జనవరిలో జాబ్ కేలండర్, పోస్టుల భర్తీ.
ప్రతియేటా డీఎస్సీ.
జాబ్ మేళాలు నిర్వహించి ప్రైవేటు ఉద్యోగాలు
యువతకు ప్రత్యేక మ్యానిఫెస్టో.
జిఓ నెం.77 రద్దు, పాత ఫీ రీఎంబర్స్ మెంట్ విధానం.
ఓటిఎస్ ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత.
చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంపు.
టిడిపి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు రప్పించి, యువతకు ఉద్యోగాలు.
స్వయం ఉపాధి కోసం నియోజకవర్గం స్థాయిలో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు. సబ్సిడీ రుణాల అందజేత.
కేజీ టూ పీజీ ఉచిత బస్ పాస్ సౌకర్యం.
మైనార్టీ బాలికలకు ప్రత్యేక కళాశాలలు.
మహిళలకు హామీలు
మహిళలను గౌరవించేలా ప్రత్యేక పాఠ్యాంశాలు.
మహిళల రక్షణకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో ప్రత్యేక విధానాలు.
మహిళలను పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ప్రోత్సాహకాలు.
అభయ హస్తం పథకం పునరుద్దరణ.
రైతులకు ఇచ్చిన హామీలు
అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణం పూర్తి.
గోదావరి మిగులుజలాలను రాయలసీమకు తెస్తాం
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సీమకు సాగు, తాగునీరు.
టెక్నాలజీతో వ్యవసాయం అనుసంధానం.
రాయలసీమ రైతాంగానికి సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్, బోర్లు.
కల్తీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం
ఎపి సీడ్స్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు.
డీకేటీ పట్టాల విషయంలో కర్ణాటక విధానాలు అమలు.
గతంలో రైతులకు అమలుచేసిన పథకాలు పునరుద్దరణ
పాదయాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీలు
కార్పెంటర్లకు అవసరమైన విధంగా షెడ్ల నిర్మాణం
ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు
సౌకర్యాలతో ఆటో స్టాండ్ల ఏర్పాటు
చంద్రన్న బీమా పున:రుద్ధరణ, బీమా మొత్తం రూ.10లక్షలకు పెంపు.
అన్న క్యాంటీన్ పునరుద్ధరణ
పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించి నిత్యవసర సరుకుల ధరలు తగ్గింపు
అర్హులైనవారికి ఫించన్లు, రేషన్ కార్డులు మంజూరు.
మొబైల్ ఫోన్లకే శాశ్వత కులధృవీకరణ పత్రాలు.
దళితులకు హామీలు
అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం
ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వంలో అమలుచేసిన 27 సంక్షేమ పథకాల పునరుద్దరణ
ఎస్సీలపై పెట్టిన అక్రమ కేసుల మాఫీ.
కార్పొరేషన్ ద్వారా గతంలో అమలైన పథకాలు పునరుద్ధరణ.
నియోజకవర్గ కేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లు
అంబేద్కర్ విదేశీవిద్య, స్టడీ సర్కిళ్ల పునరుద్దరణ.
వర్గీకరణ విషయంలో మాదిగలకు సామాజిక న్యాయం.
అమరావతిలో బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహం, విజ్ఞాన కేంద్రం.
ఎస్టీ/లంబాడీలకు
తాండాలకు సురక్షిత నీరు, రోడ్ల నిర్మాణం
ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్ నెట్ సదుపాయం
బడ్జెట్ లో నిధులు కేటాయించి తాండాలలో దేవాలయాల నిర్మాణం.
కదిరి నియోజకవర్గం కొక్కింటి క్రాస్ పరిధిలో వద్ద ఎస్టీ భవనం నిర్మాణం.
పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం ఎస్టీలకు భూ పంపిణీపై నిర్ణయం.
ముస్లింలకు ఇచ్చిన హామీలు
ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు
ముస్లింలకు ప్రత్యేక మ్యానిఫెస్టో
వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియరీ ఆధికారం
ముస్లిం కార్పొరేషన్ కు నిధులు కేటాయింపు.
ముస్లింలపై పెట్టిన అక్రమ కేసులు మాఫీ
రంజాన్ తోఫా, దుల్హన్, దుకాన్, మకాన్ పునరుద్దరణ
విజయవాడ, కడపల్లో హజ్ హౌస్ ల నిర్మాణాల పూర్తి .
పేదముస్లింలకు ప్రభుత్వ ఖర్చుతో హజ్ యాత్రకు ఏర్పాట్లు
వెనుకబడిన తరగతులకు హామీలు
బిసిలకు ప్రత్యేక రక్షణ చట్టం
బిసిలకు శాశ్వత కులధృవీకరణ పత్రాలు
బిసి కార్పొరేషన్లకు దామాషా ప్రకారం నిధులు
చేనేతలు
మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
మరమగ్గాలున్న వారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ .
ముడిసరుకు కొనుగోలుకు రాయితీలతోపాటు రుణాలు మంజూరు.
చేనేత వస్త్రాలపై జిఎస్టీ రద్దు.
జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్ల నిర్మాణం
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం.
రజకులు
రజకుల దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్
ఆదరణ ద్వారా వాషింగ్ మెషీన్లు, 500 యూనిట్లు ఉచిత విద్యుత్
తిరుపతిలో రజక భవన్ ఏర్పాటుకు కృషి
దేవుడి వస్త్రాలు ఉతికేందుకు రజకులకే కేటాయించేలా చర్యలు
అవసరమైన చోట బోర్లు వేయించి దోబీ ఘాట్ల నిర్మాణం
వడ్డెరలు
వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలు స్వాధీనం చేసుకుని తిరిగి వడ్డెర్లకు అప్పగింత.
ప్రమాదాల్లో మరణించిన వడ్డెర్లకు చంద్రన్న బీమా.
యాదవులు
యాదవ కార్పొరేషన్ నిధులు కేటాయింపు
గోశాలలో యాదవులకు రిజర్వేషన్లపై చర్చించి… నిర్ణయం
గోపాలమిత్రల పునరుద్ధరణ
గోకులాలు పున:ప్రారంభం
సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం.
22 గొర్రెలు యూనిట్ గా తీసుకుని సబ్సీడీలో అందిస్తాం.
ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలు మేపుకునేందుకు అప్పగిస్తాం.
సబ్సిడీపై మేత పంపిణీ చేస్తాం.
జీవాలను ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడేందుకు సబ్సిడీపై షెడ్ల నిర్మాణం.
గౌడ
మద్యం షాపుల్లో 20 శాతం రిజర్వేషన్
ఉపాధిహామీ అనుసంధానంతో కల్లుచెట్ల పెంపకానికి ప్రోత్సాహం
నీరా కేఫ్ ఏర్పాటు
ఆదరణ ద్వారా పనిముట్లు
ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.10 లక్షల బీమా
కురుబ/మాదాసి కురబ
రాష్ట్ర పండుగలా కనకదాసు జయంతి
సబ్సిడీపై గొర్రెలు, ఆవులు అందజేసి, ఇన్సూరెన్స్ సౌకర్యం.
22 గొర్రెలు యూనిట్ గా తీసుకుని సబ్సీడీలో అందిస్తాం.
ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలు మేపుకునేందుకు అప్పగిస్తాం.
మాదాసి కురుబలకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేసేలా చర్యలు
ప్రభుత్వ నిధులతో బీరప్ప దేవాలయ నిర్మాణం
బీరప్ప దేవాలయంలో అర్చకులకు జీతాలు అందిస్తాం.
బుడగ/బేడ జంగాలు
అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లో ఎస్సీ సర్టిఫికేట్
అన్ని రకాల సంక్షేమ పథకాల అందజేత
దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
షట్ర కులస్తులు
షట్ర కులస్థులకు దామాషా ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటుతో నిధుల కేటాయింపు(కదిరి)
కదిరిలో షట్ర కులస్థులకు యేడాదిలో భవన నిర్మాణం.
దామాషా ప్రకారం నిధులు కేటాయింపు
ఉప్పర/సగర
దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
ఉప్పరసోది, ఉప్పర మీటింగ్ అనే మాటలు నిషేధం
వక్కలిగ
వక్కలిగలను ఓబీసీలో చేర్చే అంశంపై నిర్ణయం
దామాషా ప్రకారం నిధులు కేటాయింపు
వాల్మీకి/బోయ
సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా ఎస్టీల్లో చేర్చే అంశంపై న్యాయః
దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
పెండింగులో ఉన్న కమ్యూనిటీ భవనాల నిర్మాణం
మత్య్సకారులు
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో రద్దు
ఆదరణ ద్వారా వలల అందజేత
బోట్లకు మళ్లీ డీజల్ రాయితీ
ఆర్యవైశ్యులు
రోశయ్య చేసిన సేవలకు గుర్తుగా మ్యూజియం ఏర్పాటు
ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ కు నిధులు, చిరువ్యాపారులకు రుణాలు.
ఆర్యవైశ్య మహాసభను ప్రక్షాళన
స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేలా చర్యలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం రూపకల్పన
కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గింపు
జీఎస్టీ పోర్టల్ సమస్య పరిష్కారం