కొత్త మంత్రులు చుట్టు అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారు.
తమకు మంత్రి పదవి వస్తే అది వారి నియోజకవర్గ ప్రజలకు ఎంత ఉపయోగమో భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం వీళ్ల చేష్టల వల్ల జనం విసిగిపోతున్నారు.
వారం రోజుల పాటు వేడుకలు చేస్తూ ఒక్కో రోజు ఒక్కో ఊర్లో జనజీవనానికి ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మంత్రి అయిన సందర్భంగా మొన్న శుక్రవారం జరిగిన ఊరేగింపులో ఒక పాప చనిపోయిందని వార్తలు వచ్చాయి.
ఆరోజు మంత్రి వేడుకల వల్ల కళ్యాణ దుర్గంలో ట్రాఫిక్ బంద్ చేసి స్తంభింపజేశారు. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుని ఓ చిన్నారి సమయానికి ఆస్పత్రికి వెళ్లలేక ప్రాణాలు పోగొట్టుకుందని తెలుగుదేశం ఆరోపించింది. బాధితులు కూడా మీడియా ముందు అదే చెప్పారు.
దీనిపై చంద్రబాబు లోకేష్ లు వైసీపీ మంత్రులు, నేతలపై విరుచుకుపడ్డారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వైసీపీ నేతలు అదుపులో ఉండాలని లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు అని వార్నింగ్ ఇచ్చారు.
తన మాటే శాసనం అని ఫీలయ్యే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ తనకు ఎదురుతిరిగిన వారిపే కేసులు పెట్టి వేధిస్తున్నందని ఇప్పటికే కళ్యాణదుర్గం ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. సొంత పార్టీ నేతలపై కూడా ఆమె కేసులు పెట్టించిందని టాక్. ఇపుడు ఏకంగా ఆమె అనుచరులు చంద్రబాబుపై కేసు పెట్టారు.
దీనిపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఆమె గురించి ప్రస్తావించకుండా జగన్ ను టార్గెట్ చేశారు.
మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావ్…నెక్స్ట్ ఏంటి? రౌడి షీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ.(2/2)
— Lokesh Nara (@naralokesh) April 18, 2022
జగన్ నీకు చేతనైంది చేసుకో, నీ ఇష్టమొచ్చిన కేసులు పెట్టుకో… కానీ నీ బండారం బయటపెట్టకుండా తగ్గేదేలేదు అంటున్నాడు నారా లోకేష్. బరితెగించిన వైసీపీ నేతలు ప్రజలను పీక్కుతింటున్నారని ఆయన విమర్శించారు.