ట్విట్టరులో కేటీఆర్ మహా యాక్టివ్.
ఆయనను చూసి తర్వాత అందరూ యాక్టివ్ అవడం మొదలుపెట్టారు.
పొలిటికల్ ట్విట్టరు సెలబ్రిటీ మాదిరిగా చెలరేగే కేటీఆర్ కు ఈరోజు బ్రేక్ పడింది.
కాంగ్రెస్ ను రేవంత్ ను గిల్లడానికి రేవంత్ టూర్ పై కేటీఆర్ ట్వీట్ వేశాడు
అందులో రాహుల్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించినా… ఆ పేరును మాత్రం వాడలేదు.
అయినా… రేవంత్ రెడ్డి ఇచ్చిన ఊహించని రిప్లైతో కేటీఆర్ ట్రోల్ అయిపోయాడు.
కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు!
కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా…
దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే. https://t.co/d3Iv53SYnl— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022