అమెరికాలోని బే ఏరియాలో నివసిస్తున్న ఎన్నారై ‘గోకుల్ రాచిరాజు’ క్యాన్సర్ తో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బే ఏరియాలో అందరికీ సుపరిచితుడు, ఎంతో మందికి ఆప్త మిత్రుడు అయిన ‘గోకుల్’ మరణ వార్త విని ఎన్నారైలు శోకసంద్రంలో మునిగిపోయారు.
నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ….అంటూ ఎల్లప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ జోకులు వేసే ‘గోకుల్’ మరణ వార్తను ఆయన మిత్రులు, ఎన్నారైలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆయన మృతి పట్ల ఎన్నారైలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తన ఆప్త మిత్రుడు ‘గోకుల్’ మరణ వార్త విని షాకయ్యాయని టీడీపీ ఎన్నారై నేత ‘జయరాం కోమటి’ అన్నారు.
ఆయన మృతి పట్ల ‘జయరాం’ సంతాపం వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
‘గోకుల్’ మరణవార్త విని చాలా బాధ వేసిందని, ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే ‘గోకుల్’ మన మధ్య లేరు అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని అన్నారు.
‘గోకుల్’ తో కాసేపు మాట్లాడితే ఆయన విజ్ఞానం ఏమిటో అర్థమవుతుందని, ఎటువంటి చర్చ లోనైనా తనదైన శైలిలో ఒక కొత్త పాయింట్ తో ‘గోకుల్’ మాట్లాడేవారని అన్నారు.
9 నెలల పాటు క్యాన్సర్ మహమ్మారితో పోరాడి తనువు చాలించిన ‘గోకుల్’ లేని లోటు బే ఏరియా మిత్రుల జీవితాలలో పూడ్చలేనిదని చెప్పారు.
‘భౌతికంగా మా నుంచి దూరమైనా… నీ జ్ఞాపకాలు మా మదిలో సదా పదిలం..సెలవు మిత్రమా’ అంటూ స్వాగత్ స్నేహ బృందం ‘గోకుల్’ కు నివాళులు అర్పించింది.