ఇటీవల కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల విడాకుల హడావిడి బాగా ఎక్కువైపోయింది. ప్రేమించుకోవడం.. గ్రాండ్ గా పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేయడం.. ఆ తర్వాత సెట్ అవ్వకపోతే విడిపోవడం అనేది సినీ తారలకు కామన్ అయిపోయింది. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి మరియు అతని భార్య ఆర్తి డైవర్స్ తీసుకోబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. తెలుగు బ్లాక్ బస్టర్ జయం రీమేక్ తో హీరోగా రవి తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
సేమ్ టైటిల్ తో తమిళంలో విడుదలైన జయం మంచి విజయాన్ని అందుకోవడంతో రవి కాస్త జయం రవిగా ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత తనదైన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే జయం రవి సినిమాలు తెలుగులో డబ్ అవడం వల్ల ఇక్కడ సైతం అతనికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ మధ్యన వచ్చిన పొన్నియన్ సెల్వన్ మూవీతో జయం రవి పాన్ ఇండియా స్థాయిలో నేమ్ అండ్ సేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లతో పోతున్నారు.
ప్రొఫెషన్ గురించి పక్కన పెడితే..జయం రవి వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక రూమర్స్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2009లో జయం రవి ఆర్తి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆర్తి ప్రముఖ టెలివిజన్ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె. జయం రవి ఆర్తి దంపతులకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన రవి, ఆర్తి జంట విడాకుల తీసుకోబుతున్నారనే వార్తలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
అసలు ఆ వార్తలు నిజమా.. కాదా.. అన్న కన్ఫ్యూజన్ లో ఉన్న తరుణంలో విడాకులపై జయం రవి వైఫ్ ఆర్తి పరోక్షంగా హింట్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో భర్తకు సంబంధించిన ఫోటోలను తొలగించింది. దీంతో ఈ జంట విడాకుల బాట పట్టారనే వార్తలకు మరింత బలంగా చేకూరింది. జయం రవికి ఆయన భార్య ఆర్తికి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయట. దాంతో కొన్ని రోజులుగా వారిద్దరూ సపరేట్గా ఉంటున్నారని.. ఇప్పుడు విడాకులకు కూడా అప్లై చేశారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే జయం రవి, ఆర్తి దంపతులు నేరుగా స్పందించాల్సిందే.