టీడీపీ యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌లో చాలా మార్పు కనిపిస్తోందని అంటున్నారు టీడీపీ నాయకులు. గతానికి భిన్నంగా ఆయన ఆహార్యంలో సంపూర్ణ మార్పులు కనిపిస్తున్నాయని.. యువతకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
మరి దీనికి కారణం ఏంటి? అసలు ఏయే మార్పులు వచ్చాయి? అనే విషయాలపై నేతలు గుసగుసలాడుతున్నారు. గత ఏడాదికి ముందు.. ఇప్పుడు.. లోకేష్‌లో సమూల మార్పులు సంభవించాయని చెబుతున్నారు.
గత ఏడాది ఇదే సమయానికి దేశంలో లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లిపోయిన లోకేష్ బాడీ పరంగా వర్కవుట్స్ చేశారు. దీంతో అప్పటి వరకు ఉన్న శరీర బరువును, ఊబకాయాన్ని తగ్గించుకున్నట్టు ఆయనే స్వయంగా చెప్పారు. లాక్డౌన్ తనకు ఈ రకంగా కలిసి వచ్చిందని.. వెల్లడించారు.
దీంతో సోషల్ మీడియాలోనూ లోకేష్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చక్కగా స్లిమ్‌గా తయారైన లోకేష్.. ఇలానే ఉండాలని ఆశిస్తున్నట్టు టీడీపీ నాయకులు, అభిమానులు సైతం కామెంట్లు చేశారు.
ఇక, ఇప్పుడు ఆయన మరింతగా బాడీపై శ్రద్ధ పెట్టారు. మరింతగా సన్నబడడంతోపాటు.. గడ్డం పెంచడం.. మీసాల స్టయిల్ మార్చడం.. హెయిర్ కటింగ్ యూత్‌ను ఆకర్షించేలా చేసుకోవడం.. డ్రస్ స్టైల్ మార్చడం … సెలక్టివ్ డ్రస్లనే వాడుతుండడం వంటివి ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయని అంటున్నారు సీనియర్లు.
అయితే.. ఇదంతా కూడా టీడీపీలో యూత్నే కాకుండా రాష్ట్రంలోని యూత్‌ను సైతం ఆకర్షించి.. ఒక ప్రత్యమ్నాయ ఆధునిక నాయకుడిని ఎదుగుగుతున్నారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి యూత్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే వివిధ పార్టీలు అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను కూడా యూత్‌కు ఐకాన్‌గా మారి.. వారి ఓట్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారని.. సీనియర్లు గుసగుసలాడుతున్నారు.
ఇది మంచి పరిణామమేనని.. మార్పు మంచిదేనని చెబుతున్నారు. అయితే.. యూత్ ఏమేరకు లోకేష్ వెనుక నడుస్తారు? అనేది చూడాలని అంటున్నారు.