ఔను! ఓటరు తలుచుకుంటే ఏమైనా కావొచ్చు! ఇప్పుడు ఈ మాటే నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. మెజారిటీ ప్రజలు.. స్వతంత్ర అభ్యర్థి శిరీష ఉరఫ్ బర్రెలక్కకు కు జైకొడు తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా శిరీష బరిలో దిగిన విషయం తెలిసిందే. ఆమెకు పట్టుమని లక్ష రూపాయలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్లేదు. అయినప్పటికీ.. ధైర్యంగా ఎన్నికల్లో దిగిన తీరు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో శిరీషకు అనుకూలంగా.. పాటలు, నినాదాలు.. పోటెత్తుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు బ్యానర్లు, ఎన్నికల సామాగ్రిని ఆమెకు అందించాయి. ఇక, టీ ఖర్చుల పేరుతో మరికొందరు రెండు లక్షలు అందించారు. యువత పెద్ద సంఖ్యలో ఆమెకు ఆన్లైన్ ప్రచారం చేస్తున్నారు. ఎవరూ రూపాయి ఆశించకుండా.. బర్రెక్కను గెలిపించాలనే నినాదంతో ప్రచారం కూడా చేస్తున్నారు.
దీంతో బర్రెలక్క గెలుపు.. కొల్లాపూర్‌కు మలుపు అనే నినాదం ఎటు చూసినా వినిపిస్తోంది. టీ కొట్లు, టిపెన్ సెంటర్ల దగ్గర బర్రెలక్క పేరు మార్మోగుతోంది. ఆమెను గెలిపిస్తే.. మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోం ది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, రైతు కుటుంబాలు శిరీషకు మద్దతుగా ఉన్నాయని ఆన్లైన్ సర్వేలు చెబుతున్నాయి. ఇక, బర్రెలక్క పోటీ విషయం ఆన్లైన్లో జోరుగా సాగుతుండడంతో ఈ వార్త రాష్ట్రాలు దాటిపోయింది.
ఈ క్రమంలో యానాంకు చెందిన మాజీ మంత్రి మల్లాడి కృష్నారావు..(సీఎం జగన్‌కు మిత్రుడని అంటారు) బర్రెలక్కకు మద్దతు ప్రకటించారు. ఎన్నికలకు ముందు రోజు తాను స్వయంగా వచ్చి ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఎన్నికల్లో ధైర్యంగా నిలిచిన శిరీషను అభినందిస్తూ.. ఖర్చలు కింద లక్ష రూపాయలు పంపించారు. తన మిత్రులు ఎవరైనా ఉంటే.. ఆమెకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. యువత ఆమెకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మొత్తానికి బర్రెలక్క నామినేషన్ తర్వాత.. మంచి దూకుడుతో దూసుకుపోతుండడంతో ఏమో గెలిచినా ఆశ్చర్యం లేదనే టాక్ మొదలైంది.
లేవరా యువత యుద్ధమై.. దుమ్ములేపుతున్న బర్రెలక్క ప్రచార సాంగ్#barrelakka #song pic.twitter.com/LjitR1ReHD
— MC RAJ????️ (@BeingMcking_) November 17, 2023