ఏపీలో టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న విషయంపై విభేదిస్తూ వచ్చిన కాపు సం క్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తాజాగా జనసేన మేనిఫెస్టోను రాసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఏయే హామీలు ఇవ్వాలో.. ఎవరిని టార్గెట్ చేయాలో కూడా ఆయన చెప్పుకొచ్చా రు. వాస్తవానికి కొన్నాళ్ల కిందట జోగయ్య పవన్‌కు సంచలన లేఖ సంధించారు. సీఎం సీటు వ్యవహారాన్ని ఆయన నిశితంగా విమర్శించి రాజకీయ దుమారం రేపారు.
కాపులు ఎంతో ఆశలు పెట్టుకున్నారని.. ఇప్పుడు వారిని అన్యాయం చేస్తారా? అని జోగయ్య ప్రశ్నించారు. ఇక, ఈ దుమారం నుంచే పార్టీ బయటకు రాలేదు. ఇక, ఇప్పుడు మేనిఫెస్టో పేరుతో జోగయ్య మరో వివాదా నికి తెరదీశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జనసేన.. టీడీపీతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో పై కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో జోగయ్య కొన్ని సూచనలు.. సలహాలు ఇస్తూ.. మరోసారి పవన్‌కు లేఖ సంధించారు.
దీనిలో ఆయన పేదలకు రూ.2000 చొప్పున నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని సూచించారు. దీంతోపాటు విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీలు, విద్యుత్ బిల్లుల్లో 20 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు 25వేల చొప్పున రుణ మాఫీ ప్రకటించాలని.. వృద్ధులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.3 వేల నుంచి 4 వేల కు పెంచాలని కూడా జోగయ్య సలహాలు ఇచ్చారు. మరి దీనిని ఏమేరకు పవన్ పరిగణనలోకి తీసుకుంటారనేది చూడాలి.
ఇదిలావుంటే.. జోగయ్య గతంలో రాసిన వివాదాస్పద లేఖపై పవన్ ఇప్పటి వరకు బహిరంగంగా స్పందిం చింది లేదు. ఇక, అప్పటి నుంచి పవన్ బహిరంగ సభల్లోనూ పాల్గొనలేదు. అంతర్గత చర్చలకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాసిన లేఖపై ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. మరోవైపు టీడీపీ కూడా పేదలను, ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని కీలక పథకాలకు శ్రీకారం చుట్టింది. వీటిని జనసేన కూడా సమర్తించింది. కొన్ని చిన్నపాటి మార్పులు మినహా.. జనసేన కూడా టీడీపీ మినీ మేనిఫెస్టోలకు జై కొట్టిన విషయం తెలిసిందే.