ఏపీ లో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసేంది. ఇందులో భాగంగానే తాజాగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బీసీ సంఘం నేతం ఆర్.కృష్ణయ్య ఇటీవల తమ రాజ్యసభ సభ్యత్వానికి మరియు పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ మూడు స్థానాలకు ఉప ఎన్నిక జరగబోతోంది. మంగళవారం ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. డిసెంబర్ 13 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. డిసెంబర్ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇకపోతే ఏపీతో పాటు ఒడిశా, బెంగాల్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మూడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో మరియు హర్యానాలో ఒక్కొక్క రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యాయి. ఈ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.