ప్రభుత్వాలు పన్నులు ఎందుకు వేస్తాయి?
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికే కదా.
మరి ప్రభుత్వం ఆ మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైనపుడు ఎందుకు ప్రజలు పన్ను కట్టాలి అంటోంది పవన్ బంగారం సినిమా హీరోయిన్ మీరా చోప్రా.
18 శాతం జీఎస్టీ కట్టించుకుని ప్రజలకు బెడ్లు ఇవ్వలేని దుస్తితిలో ఉన్న ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఆమె నిలదీస్తోంది.
కరోనా కష్ట కాలంతో పేషెంట్లకు ఆసుపత్రుల్లో బెడ్లు లభించడం లేదని… బెడ్లు దొరికిన వారికి ఆక్సిజన్ దొరకడం లేదని విమర్శించారు.
ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో, ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని… అలాంటప్పుడు ప్రజలు 18 శాతం జీఎస్టీని ఎందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించారు.
ఆమె ఆవేదనలో ఎంతో నిజం ఉంది. కనీస సదుపాయాలు కల్పించలేని నాయకత్వానికి పన్నులు వేసే హక్కు ఎక్కడిది?