డిజిపి, ఏడిజి ఇద్దరూ రాష్ట్రంలో ఉన్నంతకాలం ఎన్నికలు సక్రమంగా జరగవు, కావున తక్షణమే వారిపై చర్యలు తీసుకోండని ఎన్నికల కమిషన్ను కోరిన తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వినర్ బుచ్చి రాంప్రసాద్ ఫిర్యాదు చేశారు.
అనతంరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బుచ్చి రాంప్రసాద్ మాట్లాడుతూ, తెలంగణలో జరిగిన మాదిరిగా మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఎస్పీలను పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.
ప్రతిపక్ష నేతలు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో అన్ని కూడా డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఏడిజి(ఇంటెలిజెన్స్) పిఎస్ఆర్ ఆంజనేయులు దొంగచాటుగా వింటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ చేసి దేశాలకు పారిపోయిన అధికారులకు పట్టిన పరిస్థితే ఈ అధికారులకు పట్టబోతుంది.
ప్రధానమంత్రి హాజరైన సభలో జరిగిన అంతరాయాలకు డిజిపి, ఏడిజి(ఇంటెలిజెన్స్)లే బాధ్యులు.
దేశంలో ఎన్నడూ జరగని విధంగా ప్రధాని ప్రసంగిస్తుంటే 11 నిమిషాలు కరెంటు పోయింది.
ఇదంతా డిజిపి, ఏడిజి(ఇంటెలిజెన్స్) ఆధ్వర్యంలో జరిగినవే.
ప్రధానమంత్రి పర్యటనకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాల్సిన డిజిపి, ఏడిజి(ఇంటెలిజెన్స్) వారి విధులు సక్రమంగా నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారు.
ఎస్పీలు(ఇంటెలిజెన్స్) బాపూజి, ఏసుబాబు అనే ఇద్దరి ఐపిఎస్ అధికారులను పెట్టుకొని ప్రతిపక్ష నేతలందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు.
రేపు అధికారం మారబోతుంది.
అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరుగుతది.
లుకౌట్ నోటీసులు జారీ చేసే మీ మీదె రేపు లుకౌట్ నోటీసులు జారీ చేయబడతాయి అని హెచ్చరించారు.