బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగులోనూ వకీల్ సాబ్ గా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం పవన్ కు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. లేడీస్ ఓరియంటెడ్ మూవీలో ఆవేశపరుడైన వకీల్ గా పవన్ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. పింక్ తో పోల్చుకుంటే తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కోసం దర్శకుడు వేణు శ్రీరామ్…పవన్ కు హీరోయిన్ ఎపిసోడ్ ను అదనంగా జత చేశాడు.
అయితే, సినిమా మంచి విజయం సాధించినా….ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం ఇటు మెగా అభిమానులను అటు సాధారణ ప్రేక్షకులను, విమర్శకులనూ ఆకట్టుకోలేకపోయింది. శృతిహాసన్ హీరోయిన్ గా వచ్చిన ఆ ఎపిసోడ్ 15నిమిషాలే అయినా, అది సినిమాకు మైనస్ గా మారిందని పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అభిమానుల కోసం దర్శకుడు పెట్టిన ఆ ఎపిసోడ్…ప్లస్ కాకపోగా మైనస్ అయ్యేసరికి పవన్ కూడా డిజప్పాయింట్ అయ్యాడట.
అయితే, పవన్ చేసిన తప్పును తాజాగా అన్నయ్య చిరంజీవి కూడా చేయబోతున్నాడని టాలీవుడ్ లో టాక్ వస్తోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లోనూ చిరు సరసన ఓ హీరోయిన్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. కానీ, మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ వెర్షన్ లో హీరోయిన్ పాత్ర లేదు. అయితే, తెలుగులో చిరుకున్న మాస్ ఫాలోయింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ , నేటివిటీ దృష్ట్యా చిరు అభిమానుల కోసం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను దర్శకుడు మోహన్ రాజా క్రియేట్ చేశాడట.
దీంతో, పవన్ చేసిన తప్పే చిరు కూడా చేయబోతున్నాడని మెగా అభిమానులు ఫీలవుతున్నారట. మరి, ఈ పుకార్లలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ చిత్రం గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.